Sun Transit in Aries on April 14th 2023 : నెలకొకసారి సూర్యుడు తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరమంతా 12 రాశులలో సంచరిస్తాడు. రేపు అంటే ఏప్రిల్ 14న సూర్యభగవానుడు మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే మేష సంక్రాంతి అంటారు. దాదాపు నెలరోజులపాటు అదే రాశిలో ఉంటాడు. మేష రాశిని పాలించే గ్రహం అంగారకుడు. ఆత్మ, విజయానికి కారకుడిగా ఆదిత్యుడిని భావిస్తారు. ఈ మాసంలో పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. మేషరాశిలో సూర్యుని సంచారం వల్ల ఎవరికి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య సంచారం ఈ రాశులకు శుభం
1. మేషం
మేష సంక్రాంతి వ్యాపార, ఉద్యోగ రంగాలలో శుభ ఫలితాలనిస్తుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీ ఆరోగ్యం మునుపటి కంటే బాగుంటుంది. జాబ్ చేసేవారు మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి మంగళవారం బెల్లం దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


2. మిథునం
మేష సంక్రాంతి మిథునరాశి వారికి శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకండి. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీరు నువ్వులు దానం చయేడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ప్రతి మంగళవారం ఆవుకు రొట్టెలు తినిపించడం వల్ల మీకు మేకు కలిసి వస్తుంది. 


Also Read: Grah Gochar: ఈ రాశులపై 3 గ్రహాలు డబ్బు వర్షం కురిపించనున్నాయి.. ఇందులో మీరున్నారా?


3. సింహం
సింహ రాశి వారికి మేష సంక్రాంతి లాభాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. రోజూ సుందరకాండ పఠించి బెల్లం, పప్పు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. 


4. తులారాశి
సూర్య సంచారం తులారాశి వారికి అన్ని రంగాలలో విజయాన్ని అందిస్తుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్య భగవానుని అనుగ్రహం కారణంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. 


5. మీనం
మీన రాశి వారికి సూర్య సంచారం చాలా శుభప్రదమైనది. మీరు ఉద్యోగంలో పెద్ద బాధ్యతను తీసుకుంటారు. మీరు జాబ్ మారే అవకాశం ఉంది. ప్రతి ఆదివారం శ్రీ ఆదిత్య హృదయస్తోత్రాన్ని 3 సార్లు పఠించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.


Also Read: Chaturgrahi Yogam: ఏప్రిల్ 22న చతుర్గ్రహీ యోగం.. ఈ 5 రాశులపై కనక వర్షం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook