Sun Transit in Leo: సూర్యుడు ఆగస్టు 17 వ తేదీన సింహరాశిలో ప్రవేశించనున్నాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న బుధుడితో సూర్యుడి కలయిక జరగనుంది. సూర్య, బుధ గ్రహాల కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఫలితంగా 3 రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య, బుధ గ్రహాల కలయికతో ఏర్పడనున్న బుధాదిత్య రాజయోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో అద్భుతమైన శుభ సూచకంగా భావిస్తారు. ఆగస్టు 17న సూర్యుడి సింహరాశిలో ప్రవేశం కారణంగా జరుగుతుంది. ధనం, బుద్ధి, వ్యాపార దాతగా భావించే బుధుడు అప్పటికే సింహరాశిలో ఆశీనుడై ఉన్నాడు. ఆగస్టు 21 వరకూ సింహరాశిలోనే ఉంటాడు. ఈ సందర్భంగా ఏర్పడనున్న బుధాదిత్య రాజయోగంతో 3 రాశులవారు సంపదలతో తులతూగనున్నారు. ఆ మూడు రాశులేంటి, కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..


వృషభరాశి వారికి బుధాదిత్య రాజయోగం మంచి రోజుల్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగాల్లో వృద్ధి కన్పిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ సమయం కెరీర్‌పరంగా చాలా అద్భుతంగా మారనుంది. ఆదాయం పెరిగే మార్గాలు వికసిస్తాయి. వ్యాపారం పెరుగుతుంది. నెట్‌వర్క్ పెరగడంతో లాభాలు ఎక్కువౌతాయి.


తులరాశి జాతకులకు కూడా చాలా అనువైన సమయంగా ఉంటుంగది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. వ్యాపారులకు అత్యంత అనుకూలమైన సమయం. పెద్ద పెద్ద ఆర్డర్లు చేతికి వస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. డబ్పులు సంపాదించేందుకు కొత్త ప్రత్యామ్నాయాలు కన్పిస్తాయి. 


వృశ్చికరాశివారికి బుధాదిత్య రాజయోగం లాభంగా మారనుంది. ఈ జాతకుల పని వ్యవహారాల్లో వృద్ధి వస్తుంది. ఒకవేళ పదోన్నతి వంటివి నిలిచిపోయుంటే..వెంటనే క్లియర్ అవుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. రాజకీయాల్లో ఉండేవారికి అంతా అనుకూలంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తి సంపాదిస్తారు.


Also read; Horoscope Today August 14th : నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తమ ప్రేమ విషయాలను మూడో వ్యక్తితో చర్చించవద్దు...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook