Surya Gochar Effect 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల రాశి మార్పు ప్రతి వ్యక్తి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాల రాజు సూర్యభగవానుడు ఈ నెలలో తన రాశిని మార్చబోతున్నాడు. మరో 4 రోజుల్లో అంటే ఆగస్టు 17న తన సొంత రాశి అయిన సింహరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశించనున్నాడు. అక్కడే దాదాపు నెల రోజుల ఉండనున్నాడు. దీని సంచారం 3 రాశులవారికి అదృష్టాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ఈ కాలంలో ఈ 3 రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 రాశుల వారికి శుభప్రదం


కర్కాటకం (Cancer)- ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో సూర్యభగవానుడు సంచరించనున్నాడు. ఇది ఈ రాశివారికి శుభప్రదంగా ఉండనుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త జాబ్ వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


తుల (Libra): ఈ రాశి వారి 11 వ ఇంట్లో సూర్య సంచారం జరగనుంది. ఇది ఆదాయం మరియు లాభం యొక్క ఇల్లుగా భావిస్తారు. కాబట్టి సూర్యుని సంచార సమయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరుల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. విదేశాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఈ కాలంలో భారీగా లాభపడతారు. వీరు ఒపల్ రత్నం ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.


వృశ్చికం (Scorpio)-సూర్యభగవానుడు ఈ రాశి యెుక్క పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారుల భారీగా లాభాలను  ఆర్జిస్తారు. 


Also Read: Anant Chaturdashi 2022: అనంత చతుర్దశి ఎప్పుడు? దీని విశిష్టత ఏంటి? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook