Singh Sankranti Trandition 2022:  గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుని రాశిని మార్పునే సంక్రాంతి అంటారు. ఆగస్ట్ 17న సూర్యభగవానుడు కర్కాటకరాశిని వదిలి సింహరాశిలోకి (Sun Transit In Leo 2022) ప్రవేశించనున్నాడు. దీనినే సింగ్ సంక్రాంతి (Singh Sankranti 2022) అంటారు. దీని సంచారం యొక్క శుభ, అశుభ ప్రభావాలు మొత్తం 12 రాశుల మీద కనిపిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రాలజీ ప్రకారం, సంక్రాంతికి స్నానం, దానానికి ప్రాముఖ్యత ఉంది. ఈసారి సింగ సంక్రాంతికి నెయ్యి తినే సంప్రదాయం ఉంది. ఈ రోజున సూర్య భగవానుడితో పాటు విష్ణువు, నరసింహస్వామిని పూజిస్తారు. ఈ రోజున పుణ్య నదులలో స్నానమాచరించడం, దానం చేయడం మొదలైన వాటి వల్ల విశేష పుణ్యఫలితాలు లభిస్తాయి. 


ఈ రోజు నెయ్యి తినడం శుభప్రదం 


గ్రంధాల ప్రకారం, సింగ్ సంక్రాంతి రోజున నెయ్యి తినడం శుభప్రదంగా భావిస్తారు.  నెయ్యి తీసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయని నమ్ముతారు. దీనిని నెయ్యి సంక్రాంతి అని కూడా అంటారు. దీనితో పాటు, ఈ రోజున నెయ్యి తినడం వల్ల జాతకంలోని రాహు-కేతు దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజు నెయ్యి తినని వ్యక్తి తర్వాత జన్మలో నత్త రూపాన్ని పొందుతాడని నమ్ముతారు. ఇది సోమరితనానికి చిహ్నంగా పరిగణిస్తారు. 


Also Read: Mars Transit 2022 Effect: మరో 8 రోజుల్లో రాశిని మార్చబోతున్న కుజుడు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook