Sun transit 2023: సూర్యుడిని గ్రహాలకు రారాజుగా పిలుస్తారు. అలాంటి సూర్యుడు బుధుడి రాశిలో గోచారం చేయనుండటం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా 4 రాశులకు అదృష్టం వికసించనుంది. రెండు గ్రహాల కటాక్షంతో అంతులేని ధన సంపదలు లభించనున్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహ గోచారానికి విశిష్టత వేరు. సూర్యుడి రాశి వాస్తవానికి సింహం. చంద్ర, గురు గ్రహాలు సూర్యుడి మిత్రులుగా పరిగణిస్తారు. బుధుడు తర్కానికి, బుద్ధికి ప్రతీక. జూన్ 15వ తేదీన బుధుడి రాశి మిధునంలో సూర్యుడు ప్రవేశించనుండటం అత్యంత లాభదాయకం కానుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై వేర్వేరుగా ఉంటుంది. బుధుడి రాశిలో ప్రవేశించడం కారణంగా సూర్య గోచారం 4 రాశులకు మహర్దశ పట్టిస్తుంది. కోరుకున్నవి జరుగుతాయి. అంతులేని దనసంపదలు లభిస్తాయి. ఈ నాలుగు రాశుల జీవితాల్లో సూర్య, బుధ గ్రహాల కటాక్షంతో ఏ విధమైన ఆటంకం ఏర్పడదు. 


సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావంతో సింహ రాశిపై ఊహించని పరిణామాలుంటాయి. అంటే ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా విశేష లాభాలు కలుగుతాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు. మీరు ఏ పని ప్రారంభించినా అందులో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధి సాధ్యమౌతుంది. విద్యార్ధులకైతే పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. 


సూర్యుడి మిధున రాశిలో ప్రవేశించడం వల్ల మేష రాశి జాతకులకు అమితమైన లాభాలు కలగనున్నాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ముఖ్యంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. గతంలో ఎప్పుడో పెట్టిన పెట్టుడులు కలిసొస్తాయి. వ్యాపారం విస్తృతమౌతుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. 


సూర్యుడి ప్రవేశించేది మిధున రాశిలోనే. అందుకే ఈ రాశి వారి జాతకంలో ఊహించని ధనలాభం కలగనుంది. కలలో కూడా ఊహించనిరీతిలో డబ్బులు వచ్చి పడతాయి. ఆర్ధికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు. కుటుంబసభ్యులతో మంచి సమయం గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. 


సూర్యుడి గోచారం ప్రభావంతో మకర రాశి జాతకులపై కనకవర్షం కురవనుంది. ఆర్ధికంగా పరిస్థితి మెరుగుపడనుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఏ విధమైన సమస్యా తలెత్తకపోవచ్చు. విద్యార్ధులకు అనువైన సమయం. ఉద్యోగ వ్యాపారాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. సూర్యుడి ప్రవేశించేది మిధున రాశిలోనే. అందుకే ఈ రాశి వారి జాతకంలో ఊహించని ధనలాభం కలగనుంది. కలలో కూడా ఊహించనిరీతిలో డబ్బులు వచ్చి పడతాయి. ఆర్ధికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు. కుటుంబసభ్యులతో మంచి సమయం గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. 


Also read: Budh Rashi Parivartan 2023 June: బుధ గ్రహ సంచారం వల్ల ఈ రాశులవారికి కీడు రోజులు ప్రారంభం! నష్టాలు తప్పవా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook