Sun in Rohini Effect 2023: సూర్యుడి రోహిణి నక్షత్ర ప్రవేశంతో ఈ 5 రాశులకు ఊహించని ధనలాభం
Sun in Rohini Effect 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల పరివర్తనం లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అదే విధంగా గ్రహాలు నక్షత్ర పరివర్తనం కూడా చేస్తుంటాయి. దీని ప్రభావం కూడా అన్ని రాశులపై పడుతుంటుంది. ఇప్పడు సూర్యుడి నక్షత్ర గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Sun in Rohini Effect 2023: గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారానికి ప్రాముఖ్యత ఉన్నట్టే నక్షత్ర పరివర్తనం కూడా ఉంటుంది. సూర్యుడి నక్షత్ర పరివర్తనం గురించి ఇప్పుడు చర్చించుకోవాలి. సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించిన సందర్భంగా అంటే మే 25 నుంచి జూన్ 2 వరకూ కొన్ని రాశులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
సూర్యుడి రాశి పరివర్తనం లేదా గోచారానికి అత్యంత మహత్యమున్నట్టే నక్షత్ర పరివర్తనం కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. సూర్యుడి ఇప్పటికే రోహిణీ నక్షత్రంలో మారి ఉన్నాడు. జూన్ 2వ తేదీ వరకూ రోహిణిలోనే పరిభ్రమించనున్నాడు. సూర్యుడు రోహిణి నక్షత్రంలో పరిభ్రమించడం కారణంగా భూమిపై ఉష్ణోగ్రత అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈసారి మాత్రం కొన్ని రాశులకు అత్యంత ప్రయోజనకరం కానుంది. ముఖ్యంగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. జీవితంలో ఉహించని లాభాలు కలుగుతాయి. సూర్యుడి నక్షత్ర పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం..
సూర్యుడి నక్షత్ర పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుంది
సింహ రాశి జాతకులపై సూర్యుడి రోహిణి నక్షత్ర పరివర్తనం ప్రభావంతో చాలా పరిణామాలు జరగనున్నాయి. ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి ఆ కోరిక నెరవేరుతుంది. కెరీర్ కోసం చాలా మంచి సమయం. అభివృద్ధి కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం.
సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించడం మేషరాశి జాతకులకు ఆర్ధికంగా ప్రయోజనాలు కల్గించనుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మరీ ముఖ్యంగా ఆదాయం అమాంతంగా పెరడమే కాకుండా ఊహించని రీతిలో డబ్బులు వస్తాయి.
ధనస్సు రాశి జాతకులకు సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల అంతులేని కనకవర్షం కురుస్తుంది. కెరీర్ చాలా బాగుంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. మీరు పడిన కష్టానికి పూర్తిగా ప్రతిఫలం ఉంటుంది. మీ కృషి మీకు గౌరవ మర్యాదలను అందిస్తుంది. ఆరోగ్యం సైతం బాగుంటుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు.
సూర్యుడి రోహిణీ నక్షత్ర పరివర్తనం కర్కాటక రాశి జాతకులకు కీలకమైన ప్రయోజనాలు కల్గించనుంది. కీలక పదవి లేదా బాధ్యతలు లభిస్తాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకోవడంతో నలువైపుల్నించి డబ్బులు వచ్చి పడతాయి. కొత్త ఉద్యోగం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆర్ధికంగా పటిష్ట స్థితిలో ఉంటారు.
సూర్యుడి నక్షత్ర పరివర్తనం ప్రభావం మేష రాశిలో అత్యంత లాభదాయకం కానుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఉంటాయి. మీరు చేసే పనులు ప్రశంసనీయంగా ఉంటాయి ఊహించని మార్గాల్నించి భారీగా డబ్బు లభిస్తుంది. ఆష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook