Surya Gochar In Virgo 2022: సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి మారడాన్ని సంక్రాంతి అంటారు. ఈ నెలలో సూర్యుడు కన్యారాశిలోకి సంచరించనున్నాడు. రేపు అంటే సెప్టెంబరు 17, శనివారం ఉదయం 07:11 గంటలకు సూర్యభగవానుడు సింహరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి (Sun Transit in Virgo 2022) ప్రవేశించనున్నాడు. దీనినే కన్యా సంక్రాంతి అంటారు. దీంతో కొన్ని రాశులవారికి శుభకాలం మెుదలుకానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries)- సూర్య సంచారం వల్ల మేషరాశి వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్య పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అయితే విద్యార్థులకు ఈ సమయం అంతగా కలిసి రాకపోవచ్చు. విదేశాల్లో పౌరసత్వం కోసం మీరు ప్రయత్నిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది. 


కర్కాటకం (Cancer)- మీకు అదృష్టం కలిసి వస్తుంది. దీర్ఘకాలంగా మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లియితే దాని నుండి ఉపశమనం లభిస్తుంది. సూర్యుడు ఈ రాశి యెుక్క మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు, కాబట్టి ఈ రాశివారికి ఇది వరమనే చెప్పాలి. కోర్టు కేసుల్లో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది.  ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగవచ్చు. 


వృశ్చికం (Scorpio)- సూర్యుడి రాశి మార్పు వీరి ఆదాయాన్ని పెంచుతుంది. వివిధ ఆదాయ వనరుల నుండి డబ్బును పొందుతారు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఈ రాశిచక్రంలోని పదకొండవ ఇంట్లో సూర్యుడు సంచరించడం ఈ రాశివారికి చాలా శుభప్రదం. మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు  ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


ధనుస్సు (Sagittarius)- ఈ రాశి వారి వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. 


సింహం (Leo)- సూర్య సంచారం ఈ రాశి వారికి మేలు చేస్తుంది. సూర్యుడు సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు వృత్తి మరియు  వ్యాపారపరమైన రంగాలలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఎక్కడైనా చిక్కుకున్న డబ్బు తిరిగి పొందుతారు. 


Also Read: Vishwakarma Puja 2022: రేపే దేవశిల్పి విశ్వకర్మ జయంతి.. ప్రాముఖ్యత, పూజ విధానం తెలుసుకోండి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook