Sun transit in Cancer: జూలై నెలలో ఆ మూడు రాశులకు పండగే పండగ, డబ్బుల వర్షం కురుస్తుందట
Sun transit in Cancer: జూలై నెలలో చాలా గ్రహాలు రాశి మారనున్నాయియ జూలై 16నుంచి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. అటు మంగళ, శుక్ర గ్రహాలు కూడా ఇదే నెలలో రాశి మారుతున్నాయి. ఈ పరివర్తనం వల్ల ఏయే రాశులకు లాభం ఉందో చూద్దాం..
Sun transit in Cancer: జూలై నెలలో చాలా గ్రహాలు రాశి మారనున్నాయియ జూలై 16నుంచి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. అటు మంగళ, శుక్ర గ్రహాలు కూడా ఇదే నెలలో రాశి మారుతున్నాయి. ఈ పరివర్తనం వల్ల ఏయే రాశులకు లాభం ఉందో చూద్దాం..
ప్రతి నెలా కొత్త ఆశలు, కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది. ఈ తరుణంలో జూలై నెల విషయంలో ఇప్పట్నించే ఆశలు మొదలవుతున్నాయి. రానున్న సమయం ప్రయోజనకరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ అదంతా గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటుంది. ఇదే జ్యోతిష్యశాస్త్రం చెబుతున్న విషయం. జూలై నెలలో చాలా గ్రహాలు రాశి మారనున్నాయి. శుభ, అశుభ ప్రభవాం రాశులపై ఎలా ఉంటుందో చూద్దాం.
జూలైలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు వంటి పెద్ద గ్రహాలు రాశి మారుతున్నాయి. 68 రోజుల తరువాత జూలై 2వ తేదీన బుధుడు తన మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. అటు జూలై 16వ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా..మంగళ, శుక్ర గ్రహాలు కూడా రాశి మారుతున్నాయి. ఈ పరిణామాలన్నీ జూలై నెలలోనే జరగనున్నాయి. ఫలితంగా ఏయే రాశులపై ఏం ప్రభావం పడుతుందో పరిశీలిద్దాం..
సింహరాశి వారికి జ్యోతిష్యశాస్త్రం పకారం చాలా అనుకూలమైంది. పనిచేసేచోట విజయం లభిస్తుంది. అటు పదోన్నతి అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. గ్రహాలు రాశి మారడం వల్ల లాభం కలగనుంది. ఈ సందర్భంగా మీరు మీ ఆఫీసుల్లో బాగా పనిచేస్తారు. మంచి ఉద్యోగాల ఆఫర్లు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలకు అవకాశాలెక్కువ. దాంతో పాటు వ్యాపారం కూడా కలిసొస్తుంది.
ధనస్సు రాశి జాతకంలో ఆర్ధికంగా ఈ నెల చాలా మంచిది. ఈ సమయంలో కుబేరుడు డబ్బులు కురిపిస్తాడు. అటు డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. భూమి ఆస్థి వంటి వ్యవహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పెట్టుబడులకు మంచి సమయం. సేవింగ్ ప్లాన్స్ కూడా లాభాన్నిస్తాయి.
మిధున రాశి వారికి జూలై నెల ఫలప్రదంగా ఉంటుంది. పనిచేసేచోట గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఈ సందర్బంగా పెద్ద పెద్ద బాధ్యతలు మీ భుజాలపై ఉంటాయి. ఒకవేళ వ్యాపారం విస్తృతం చేయాలని ఆలోచిస్తుంటే ఇది చాలా మంచి సమయం. ఉద్యోగస్థులకు పదోన్నతి , వృద్ధి లభిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం చూసేవారికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జూలైలో పితృ సంపదతో లాభం కలగవచ్చు. పెట్టుబడులకు అనువైన సమయం.
Also read: Tulsi Plant: తులసి మొక్క ఎండితే అరిష్టమేనా..మరి ఎండిపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook