Sun Transit: సూర్యుడి రాశి పరివర్తనం..అక్టోబర్ 17 నుంచి ఆ రాశివారికి ఉద్యోగాలు, పదోన్నతులు
Sun Transit: సూర్యుడి రాశి పరివర్తనం ఈసారి ఆ రాశివారి అదృష్టాన్నే మార్చేయనుంది. ముఖ్యంగా కొత్త దంపతులకు, నిరుద్యోగులకు జీవితం మారిపోనుంది. ఆ వివరాలు మీ కోసం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడి రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతున్న..ఒక రాశిపై మాత్రం తిరుగులేకుండా ఉంటుంది. ఆ రాశి ఏది, ఎవరి జాతకం మారనుందో తెలుసుకుందాం..
దీపావళికి ముందే ఆ రాశివారి జీవితం మారిపోనుంది. సూర్యుడి ఈ నెల 17న తులారాశిలో ప్రవేశించనున్నాడు. అంటే దీపావళికి వారం రోజుల ముందు సూర్యుడి రాశి మారనున్నాడు. సూర్యుడు తులారాశిలో మారడం..కుంభరాశి జాతకులపై విశేషంగా ప్రభావం చూపించనుంది. మిగిలిన రాశులపై కూడా ప్రభావం కన్పిస్తుంది.
ఈసారి సూర్యుడి రాశి పరివర్తనం కుంభరాశిలోని కొంతమంది అదృష్టాన్ని పూర్తిగా మార్చేయనుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతుల్లో ఒకరికి ఉద్యోగం లభించనుంది. ఇప్పటికే ఉద్యోగులైతే పదోన్నతి కలగనుంది. ఉద్యోగం కోసం అణ్వేషించే యువకులకు శుభం కలగనుంది. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి అర్హతను బట్టి ఉద్యోగం లభిస్తుంది. ఎక్కువ లాభాలున్నాయని ఆశ పడకుండె తెలివిగా వ్యవహరించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. లేకపోతే అపారమైన ధననష్టం ఉంటుంది. వ్యాపారం సరిగ్గా లేక నష్టాలెదుర్కోవచ్చు. అయినా నిరాశ చెందాల్సిన పనిలేదు.
కుటుంబంలో సంతానం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ సంతానం టీనేజ్‌లో ఉంటే..వారితో మిత్రత్వం పాటించాలి. తద్వారా చెడు అలవాట్లకు గురికాకుండా కాపాడవచ్చు. చిన్నోళ్లైతే వారి దినచర్య, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సుదూర ప్రయాణాలు చేయవద్దు. సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు కుటుంబసభ్యులతో కాంటాక్ట్‌లో ఉండాలి.
వాతావరణ మార్పు ప్రభావం మీపై కూడా పడనుంది. కొద్దిగా జాగ్రత్తలు అవసరం. పౌష్ఠిక ఆహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. అనవసరమైన చోట మాట్లాడకుండా ఉండటం మంచిది.
Also read: Shani Bhagawan: శని దేవుడికి వీటిని సమర్పిస్తే చాలు.. మీరు ఏం కోరుకున్నా జరిగి తీరాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook