Sun Transit 2023 In May:  ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ప్రతి నెలా సూర్యభగవానుడు రాశిని మారుస్తాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పునే మనం సంక్రాంతి అంటాం. ప్రస్తుతం ఆదిత్యుడు మేషరాశిలో కూర్చున్నాడు. మే 15, ఉదయం 11.58 గంటలకు సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు.  జూన్ 15 సాయంత్రం 6.25 వరకు అదే రాశిలో సంచరించనున్నాడు. వృషభంలో సూర్యుడి గోచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
ఈ రాశిచక్రం యొక్క తొమ్మిదవ ఇంట్లో భానుడు సంచరించబోతున్నాడు. దీంతో మీరు ఆధ్యాత్మికతకు సంబంధించిన పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కొత్త ఉద్యోగాన్ని సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం ఉంది. 
మకరరాశి
ఈ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో సూర్యుడు సంచరించబోతున్నాడు. దీంతో మీరు ఆర్థికంగా బలపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. లవ్ లైఫ్ బాగుంటుంది.మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.


Also Read: Guru Uday 2023: మరికొన్ని గంటల్లో వీరి జాతకం మారిపోనుంది.. ఇందులో మీరున్నారా?


కర్కాటక రాశి
ఈ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో సూర్యుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది.
సింహరాశి 
సూర్యుడు ఈ రాశిచక్రంలోని పదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. 


Also Read: Planet Transits May 2023: వచ్చే నెలలో 4 గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ 5 రాశులకు ఆకస్మిక ధనలాభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook