Sun Transit In Pisces 2023: ఆస్ట్రాలజీలో సూర్యదేవుడును గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యభగవానుడు ప్రతి నెలా రాశిని మారుస్తాడు. సుర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఈనెల 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.  దీనినే మీన సంక్రాంతి అని పిలుస్తారు. బృహస్పతి మీన రాశికి అధిపతి. ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యభగవానుడు మరియు బృహస్పతి మిత్రులు. గురు రాశిలో సూర్యుడి సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడి సంచారం ఈ రాశులకు వరం
మీన రాశిచక్రం
సూర్యభగవానుని సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి ద్వారా లగ్న గృహంలో ప్రయాణిస్తాడు. దీని కారణంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. మీరు  చాలా హెల్తీగా ఉంటారు. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీపై శని సడేసతి మెుదలైంది. ఈ సమయంలో మీరు కాస్తా జాగ్రత్తగా ఉండాలి. 
ధనుస్సు రాశిచక్రం
సూర్యభగవానుడి రాశి మార్పు ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి నాల్గవ ఇంట్లోకి వెళ్లబోతున్నాడు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు.
వృశ్చిక రాశిచక్రం
సూర్యభగవానుని సంచారం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి ఐదో ఇంట్లోకి సంచరించబోతున్నాడు. దీంతో మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు అనుకోకుండా డబ్బు పొందుతారు. మీరు కెరీర్ లో అద్బుతమైన పురోగతి సాధిస్తారు. 


Also Read: Gajkesari Rajyog: ఉగాది తర్వాత 'గజకేసరి రాజయోగం'.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook