Surya Gochar 2023 in leo: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ప్రస్తుతం భాస్కరుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడు సెప్టెంబరు 17, మధ్యాహ్నం 01:43 గంటలకు కన్యారాశిలోకి (Sun transit 2023 in virgo) ప్రవేశించనున్నాడు. అక్టోబరు 18 వరకు అదే రాశిలో ఉంటాడు. సూర్యుడిని గౌరవం మరియు విజయానికి కారకుడిగా భావిస్తారు. సూర్యుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి
సూర్యుడి రాశి మార్పు సింహరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీ సంపద పెరుగుతుంది. పోగొట్టుకున్న డబ్బు తిరిగి వస్తుంది. మీకు పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీకు వివిధ వనరుల ద్వారా ఆదాయం వస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.
ధనుస్సు రాశి
భాస్కరుడు సంచారం ధనస్సు రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ లో దూసుకుపోతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
మేషరాశి 
కన్యారాశిలో సూర్యుడి సంచారం మేషరాశి వారికి కలిసి వస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. సూర్యుడి సంచారం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.


Also Read: Budh Uday 2023: సెప్టెంబర్ 15న ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook