Sunday Worship Tips: హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితం చేయబడింది. ఆదివారం సూర్య భగవానుని ఆరాధనకు మంచిరోజు. ఈ రోజున భక్తులు హృదయపూర్వకంగా పూజించడం మరియు ఉపవాసం మొదలైనవి పాటించడం ద్వారా సూర్య భగవానుడి (Lord Surya)అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క అదృష్టం సూర్యుని ప్రకాశం వలె ప్రకాశిస్తుంది. సూర్యుడు.. వృత్తి, ప్రతిష్ట, పేరు, తెలివితేటలకు కారకునిగా భావిస్తారు. జాతకంలో సూర్యుడిని బలపరచడం ద్వారా ఆ వ్యక్తి యొక్క కెరీర్ గుర్రంలా వేగంగా దూసుకుపోతుంది. ఆదివారం ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం ఈ పనులు చేయకండి: 
>> ఆదివారం ఉపవాసం పాటించేవారు ఆ రోజు ఉప్పు తినకూడదు. అనారోగ్యంతో ఉన్నవారు అయితే ఉప్పును తినవచ్చు.
>>  ఈ రోజున నలుపు, నీలం, బూడిద, గోధుమ రంగుల దుస్తులను ధరించవద్దు. ఇది వ్యక్తి జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది.
>>  ఆదివారం రోజున రాగి వస్తువులు అమ్మకూడదు. ఈ రోజున రాగిని అమ్మడం వల్ల మనిషి జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు.
>>  సండే రోజు సూర్య భగవానుని పూజించే వారు జుట్టు కత్తిరించుకోకూడదు. అలాగే, మాంసం మరియు ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. 


ఆదివారం ఈ పనులు చేయండి: 
>>  ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత రాగి కలశంలో నీరు, అక్షతలు, పువ్వులు మరియు రోలి పోసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించండి. మీరు దీన్ని క్రమం తప్పకుండా చేయలేకపోతే, ఖచ్చితంగా ఆదివారం నాడు అర్ఘ్యంను సమర్పించండి.
>>  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యభగవానుని అనుగ్రహం పొందడానికి మరియు జాతకంలో సూర్యుడు బలపడటానికి ఆదివారం ఉపవాసం ఉండండి.
>>  ఆదివారంతో పాటు సూర్య భగవానుడి మంత్రాలను క్రమం తప్పకుండా జపించడం ద్వారా సూర్యభగవానుడు సంతోషిస్తాడు.
>>  సూర్యభగవానుని అనుగ్రహం పొందడానికి రాగి కంకణం ధరించండి. పురుషులు కుడి చేతికి మరియు స్త్రీలు ఎడమ చేతికి ధరిస్తారు.
>>  సూర్యభగవానుడు తండ్రికి కారకునిగా భావిస్తారు. కాబట్టి సూర్యభగవానుని అనుగ్రహం పొందాలంటే తండ్రిని గౌరవించండి.


Also Read: Venus Transit In Taurus 2022: ఈ వ్యక్తులు ధనవంతులు కావడానికి కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook