Grahan 2024: 2024లో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు? రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
Grahan effect 2024: రాబోయే సంవత్సరంలో రెండు సూర్య, రెండు చంద్ర గ్రహణాలు సంభవించబోతున్నాయి. ఈ గ్రహణాలు కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది.
Surya and Chandra Grahan 2024 Effect: హిందూ మతం మరియు జ్యోతిషశాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణాలను హిందువులు అశుభంగా భావిస్తారు. ఈ కాలంలో పూజలు, శుభకార్యాలు, ఎటువంటి ముఖ్యమైన పనులు చేయరు. 2024లో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఈ సారి గ్రహణాలు కన్యా మరియు మీనరాశుల్లో సంభవించబోతున్నాయి. తొలి చంద్ర, సూర్యగ్రహణాలు కన్యా రాశిలోనూ, తర్వాత రెండు మీనరాశిలోనూ ఏర్పడనున్నాయి. ఈ గ్రహణాలు కన్యా, మీన రాశులపైనే కాకుండా ఇతర రాశులపై కూడా శుభ, అశుభ ప్రభావాలను చూపబోతున్నాయి.
గ్రహణ తేదీలు
** 2024 సంవత్సరంలో మార్చి 25న కన్యారాశిలో తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది.
** వచ్చే ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న మీనరాశిలో ఉండనుంది.
** కొత్త సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న మీనరాశిలో సంభవించనుంది.
** 2024లో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2న కన్యారాశిలో ఏర్పడబోతుంది.
ఈ రాశులపై గ్రహణం ప్రభావం
సూర్య, చంద్ర గ్రహణాలు కన్యా మరియు మీనరాశుల్లో సంభవించబోతున్న నేపథ్యంలో.. గ్రహణ సమయంలో ఆ రెండు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
అదే సమయంలో కుంభ, కన్యా, సింహ రాశుల వారికి 2024 సంవత్సరంలో వచ్చే గ్రహణాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ మూడు రాశుల వారు ఆర్థికంగా లాభపడతారు. వీరి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఇక మిగిలిన రాశులపై మిశ్రమంగా ఉంటుంది.
Also Read: Saturn Retrograde effect: 2024లో తిరోగమనంలో శని... ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి