Surya And Shani Connection: అబ్బబ్బా.. లక్ అంటే ఈ రాశులదే.. జాక్‌పాట్ కొట్టేశారు!
Surya And Shani Connection: సూర్య గ్రహం శని పాలించే కుంభరాశిలోకి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రవేశించబోతోంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Surya And Shani Connection: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే శని గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహాన్ని ఎంతో శక్తివంతమైంది గా భావిస్తారు అలాగే ఎంతో ప్రభావం కలిగిన గ్రహంగా కూడా చెప్పుకుంటారు శని చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తాడు దీనివల్ల ఏలినాటి శని అర్ధాష్టమి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. వచ్చే ఏడాది శని గ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనికంటే ముందు 2025 సంవత్సరం ఫిబ్రవరిలో సూర్యగ్రహణం కుంభరాశిలోకి ప్రవేశించబోతోంది. దీనివల్ల శని సూర్యుల కలయిక జరగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులు విశేషమైన ప్రయోజనాలు పొందుతాయి. అలాగే మరికొన్ని రాశుల వారికి జీవితంలో ఎన్నడూ లభించని ధన లాభాలు కూడా కలుగుతాయి అయితే ఈ ఒక నెలపాటు ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
మేషరాశి
2025 సంవత్సరంలోని ఫిబ్రవరి నెల మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరడమే కాకుండా ఉద్యోగాలకు సంబంధించిన అన్ని విషయాలను విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మేష రాశి వారికి శని సూర్య గ్రహాల కలయిక కారణంగా ఉద్యోగాలపరంగా చాలా వరకు కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఇంక్రిమెంట్స్ లభించడమే కాకుండా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితంలో అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దీంతోపాటు ఈ సమయంలో సంతోషం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే సింహ రాశి వారికి దీర్ఘకాలికంగా ఆగిపోతున్న పనులు కూడా పరిష్కారం అవుతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి కూడా శని సూర్య గ్రహాల కలయిక కారణంగా వచ్చేయడానికి ఫిబ్రవరి నుంచి వ్యాపారాల పరంగా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ సంయోగం జీవితంలో సానుకూల మార్కులకు దారితీస్తుంది. అలాగే అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా వైవాహిక జీవితంలో ఎప్పుడు పొందలేని ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా సింహ రాశి వారు ఈ సమయంలో వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో వస్తున్న డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే అన్ని విధాల ఈ సమయంలో వీరికి కలిసొచ్చే అవకాశాలున్నాయి. సింహరాశి వారికి ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి.
Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'
ధనస్సు రాశి
2025 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలపరంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంటే ప్రమోషన్స్ లభించడమే కాకుండా భారీగా జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఏ పని చేసిన డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. దీని కారణంగా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీరికి సమాజంలో గౌరవం పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ధనస్సు రాశి వారికి ఆర్థిక పరిస్థితుల పరంగా కూడా విపరీతమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి రావడం వల్ల ఎలాంటి పనులు ప్రారంభించిన విజయం సాధిస్తారు.
Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.