Trigrahi Yog: ధనుస్సు రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Trigrahi Yog In Dhanu: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ధనుస్సు రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Trigrahi Yog In Dhanu Rashi: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల ధనుస్సు రాశిలో త్రిగ్రాహి యోగం (Trigrahi Yog In Dhanu) ఏర్పడుతుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. దీని ఎఫెక్ట్ మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఈయోగ ప్రభావం వల్ల వీరు కెరీర్ లో పురగోతి, వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి.
మేషం (Aries): త్రిగ్రాహి యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో చేసే పనుల్లో విజయం ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio): త్రిగ్రాహి యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. అందుకే ఈ సమయంలో ఆకస్మిక ధనాన్ని పొందుతారు. ఈ యోగం మీకు ఆర్థిక పురోభివృద్ధిని, లాభాన్ని ఇస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పాత పెట్టుబడుల నుండి లాభం పొందుతారు.
మిథునం (Gemini): త్రిగ్రాహి యోగం మీకు ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ లభిస్తుంది. పెళ్లికానీ యువతీయువకులు వివాహం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులో మీ సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది.
Also read: Shukra Gochar 2022: డిసెంబర్ 29న శుక్రుడి చివరి సంచారం.. ఈ 4 రాశుల వారి జీవితం అల్లకల్లోలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook