Surya-Mangal: మరో 6 రోజుల్లో ఈరాశులకు అనుకోకుండా ధనం.. ఇందులో మీరున్నారా?
Navpancham Yog: జ్యోతిష్యం ప్రకారం, ఫిబ్రవరి 13న నవపంచం యోగం ఏర్పడుతోంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Sun-Mars Navpancham Yog: జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒకే రాశిలో గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. ఈ గ్రహాల కలయిక కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. జ్యోతిష్కుల ప్రకారం, రెండు స్నేహపూర్వక గ్రహాలు ఒకదానికొకటి తొమ్మిదవ మరియు ఐదవ స్థానంలో కూర్చుంటే.. అది చాలా పవిత్రమైన సంచారంగా భావిస్తారు. సూర్యుడు, కుజుడు త్రికోణ స్థితిలో ఉండటం వల్ల నవపంచం యోగం ఏర్పడబోతుంది. ప్రస్తుతం సూర్యుడు మకరరాశిలో, కుజుడు వృషభరాశిలో కూర్చున్నాడు. నవపంచం యోగం వల్ల ఏరాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
నవపంచం యోగం ఈ రాశులకు వరం
మేషరాశి
నవపంచం యోగం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ రాశిచక్రంలో కుజుడు రెండవ స్థానంలో, సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నాడు. దీంతో ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులుకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జాబ్ చేసే వారు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.
వృషభం
ఇది వృషభరాశికి అనుకూలంగా ఉంటుంది. మీ రాశిలో కుజుడు బలమైన స్థానంలోనూ, సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నాడు. దీంతో అదృష్టం కలిసి వస్తుంది. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లి చదవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. జాబ్ నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక వారికి ఈ యోగం ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశిలో కుజుడు శుభస్థానంలో కూర్చొని కేంద్ర త్రిభుజం రాజయోగం ఏర్పడుతోంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. వ్యాపారులు భారీగా డబ్బు సంపాదిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే.. మీరు విజయాన్ని సాధిస్తారు.
Also Read: Surya Gochar 2023: ఏడాది తర్వాత శని రాశిలో సూర్య-శుక్ర సంయోగం.. ఈ రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook