Surya Dev Worship: సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఈ చిన్న విషయాలు గుర్తించుకోండి, ఇక మీకు తిరుగుండదు..
Surya Dev Worship: ఆదివారం సూర్య భగవానుడిని పూజిస్తారు. ఈ రోజున సూర్యభగవానునికి నీరును అర్ఘ్యంగా సమర్పిస్తే ఆ దేవుడు మీరు కోరిన కోరికలు తీరుస్తాడు.
Surya Dev Puja Tips: హిందువులు వారంలోని ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. ఆదివారం సూర్యభగవానుడిని(Surya Dev) పూజిస్తారు. ఈయనకు నిత్యం నీటిని అర్ఘ్యంగా సమర్పిస్తే వెంటనే ఆయన ప్రసన్నుడై దీవెనలు కురిపిస్తాడని నమ్ముతారు. అంతేకాకుండా ఆ వ్యక్తికి తెలివి, బలం, జ్ఞానం, తేజస్సుతోపాటు సమాజంలో గౌరవాన్ని పొందుతాడు. అయితే అర్ఘ్యంగా నీటిని సమర్పించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
సూర్య భగవానుని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు
>> ఒక వ్యక్తి యొక్క జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే, అతను క్రమం తప్పకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యంగా నీటిని సమర్పించాలి.
>> మీరు కష్టపడి పని చేసినా అనుకున్న ఫలితాలను సాధించలేకపోతే సూర్య భగవానుని క్రమం తప్పకుండా పూజించడం మరియు ఆయనకు నీరు సమర్పించడం వల్ల మేలు జరుగుతుంది.
>> సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం వల్ల ఆ వ్యక్తి బాధల నుండి విముక్తి పొందుతాడు. అంతేకాకుండా ఆ వ్యక్తిలో అహంకారం మరియు కోపం నశిస్తాయి. ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది.
అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం వల్ల రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. అర్ఘ్యాన్ని ఎప్పుడూ రాగి పాత్రలో మాత్రమే ఇవ్వాలి. దీనితో పాటు కుంకుమ, పూలు, అక్షత మొదలైన వాటిని నీటిలో వేయాలి. మీ ముఖాన్ని తూర్పు దిశలో ఉంచాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అర్గ్యాన్ని సమర్పించేటప్పుడు బూట్లు మరియు చెప్పులు ధరించకూడదు. అర్ఘ్యం సమర్పిస్తున్నప్పుడు నీటి ప్రవాహంలో సూర్య భగవానుడి కిరణాలను చూడటం శుభప్రదంగా భావిస్తారు.
Also Read: Shani Dev Margi October 2022: మార్గంలోకి శనిదేవుడు.. మరికొన్ని రోజుల్లో మారనున్న ఈ రాశుల ఫేట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook