Surya Rashi Parivartan 2023: వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. మీ జాతకంలో సూర్యుడు శుభప్రదంగా ఉంటే మీరు జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు. అంతేకాకుండా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఈనెల 14న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏడాది తర్వాత ఆదిత్యుడు తన ఉన్నతమైన మేషరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. సూర్యుడి గోచారం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: సూర్యుడు సంచార తర్వాత మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో పెద్ద బాధ్యతను తీసుకుంటారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. మీ లైఫ్ లో సంతోషం నెలకొంటుంది. 
మిథునం : సూర్యుని రాశి మార్పు మిథున రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీరు అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త వనరుల నుండి లాభం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ప్రమోషన్ పొందుతారు. 


సింహరాశి: సూర్యుని సంచారం సింహరాశి వారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది. సూర్యుడు సింహ రాశికి అధిపతి మరియు ఈ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీకు జాబ్ లో ప్రమోషన్ కూడా రావచ్చు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది.  
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి సూర్య సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. పనిలో పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం  రెట్టింపు అవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుది. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. 


Also read: Mangal Gochar 2023: కర్కాటక రాశి ప్రవేశం చేయనున్న కుజుడు.. ఈ 4 రాశులకు లాభాలు బోలెడు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook