Sunday Remedies: ఆదివారం ఈ చిన్న పరిహారం చేయండి.. సూర్యభగవానుడి అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తి పొందండి..
Sunday Remedies: ఆదివారాల్లో సూర్య భగవానుని పూజిస్తారు. సూర్యభగవానుని అనుగ్రహం ఉన్న వ్యక్తి లైఫ్ లో ఉన్నత స్థాయికి వెళతాడు. అంతేకాకుండా ఆదివారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మీ సమస్యలన్నింటినీ సూర్యుడు తొలగిస్తాడు.
Sunday Puja tips: హిందువులు ఆదివారం నాడు సూర్యభగవానుడిని పూజిస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. సూర్యభగవానుని అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండటంతోపాటు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతాడు. ఎవరి జాతకంలో సూర్యుడు (Surya Dev) బలంగా ఉంటాడో వారికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయి. మీ జాతకంలో సూర్యుడు అశుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. అయితే సూర్యుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఆదివారం నాడు ఈ పరిహారాలు చేయండి.
ఈ పరిహారాలు చేయండి..
>> కుండలిలో సూర్యుడు అశుభ స్థానంలో ఉన్న వ్యక్తులు ఆదివారం నాడు పిండి మాత్రలు చేపలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. అలాగే మీ ఇబ్బందులు కూడా దూరమవుతాయి.
>> ఆదివారం ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఆ దేవుడి ఆశీస్సులు లభిస్తాయి. అనంతరం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఇంట్లో దేనికీ లోటు ఉండదు.
>> ప్రతిరోజూ పూజించడం వీలుకాకపోతే కనీసం ఆదివారం అయినా తప్పకుండా సూర్యదేవుడిని ఆరాధించండి. అంతేకాకుండా సూర్యుని ఆరాధనలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పక పఠించండి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు సంతోషించి భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు.
>> ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం, బియ్యం కలిపి ఆ నీటిలో పోయండి. ఇలా చేయడం వల్ల భక్తులపై సూర్యభగవానుడి తన దీవెనలు కురిపిస్తాడు.
Also Read: Budh Margi 2022: అక్టోబరు 2న సంచారంలోకి బుధుడు... ఈ రాశులవారు జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook