Surya Gochar 2023: సూర్యగ్రహం సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో మంచి రోజులు ప్రారంభం..
Surya Gochar 2023: సూర్యగ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Surya Gochar 2023: అన్ని గ్రహాలకు రారాజుగా భావించే సూర్యుడు సెప్టెంబర్ 17వ తేదిన రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 01:42 గంటలకు కన్యారాశిలోకి సంచారం చేయనుంది. సూర్య గ్రహం 30 రోజుల వరకు కన్యారాశిలోనే ఉండబోతున్నాడు. అయితే సూర్యుడు 12 గ్రహాలు సంచారం చేయడానికి మొత్తం సంవత్సరం పాటు కాలం పడుతుంది. ఈ గ్రహం ప్రతి రాశిలోకి సంచారం చేసినప్పుడు అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారు ఆర్థికంగా లాభాలు పొందుతారు, మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ప్రభావాల బారిన పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేషరాశి:
సూర్యుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వల్ల మేష రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి, ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నవారు ఈ సమయాల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో కష్టపడి పనులు చేయడం వల్ల గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
సింహ రాశి:
సింహ రాశికి అధిపతిగా సూర్య భగవానుడు వ్యవహరిస్తాడు. అయితే ఈ సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల సింహ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అక్టోబరు 18 వరకు ఈ రాశివారు ఎలాంటి పనులైన సులభంగా చేసి విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా నిలిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది మంచి సమయంగా భావించ్చు. ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేసిన సులభంగా డబ్బు పొందుతారు.
ధనుస్సు రాశి:
సూర్యుడి సంచారంతో ధనస్సు రాశివారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా పుట్టుకొని వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో శుభవార్తాలు వింటారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి