Surya Gochar 2023 effect: గ్రహాల రాజు సూర్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. సూర్యుడి ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి యెుక్క సంక్రాంతి అని పిలుస్తారు. రీసెంట్ గా అంటే మే 15,  సోమవారం ఉదయం 11.32 గంటలకు ఆదిత్యుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో జూన్ 15 వరకు ఉంటాడు. భానుడు యెుక్క సంచారం కొన్ని రాశులవారికి సానుకూలంగానూ, మరికొన్ని రాశులవారికి ప్రతికూలంగా ఉండనుంది. సూర్యుడి గోచారం వల్ల ఏయే రాశులవారు లబ్ది పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
ఈ రాశి అధిపతి సూర్యుడు. ఆదిత్యుడి సంచారం సింహరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే వారి కోరిక నెరవేరుతుంది. ఆఫీసులో మీ పనిని బాస్ మెచ్చుకుంటాడు. మీరు ఆర్థికంగా బలపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
ధనుస్సు రాశి
భానుడు సంచారం ధనస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ కెరీర్ దూసుకుపోతుంది. 


Also Read: Luck Zodiac Signs: పుట్టినప్పటి నుండి ఈ రాశులవారు ధనవంతులు.. ఇందులో మీరున్నారా?


కర్కాటక రాశి
సూర్యుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు ఉన్నతాధికారుల సపోర్టు లభిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
మీనరాశి
ఆదిత్యుడి గోచారం మీనరాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. 


Also Read: Shukra Gochar 2023: ఈనెల 30న శుక్ర సంచారం.. ఈ 4 రాశులపై డబ్బు వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook