Surya Gochar 2024 In Telugu: సూర్య గ్రహం ప్రతినెల ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తూ ఉంటుంది ఇలా సంచారం చేయడం కారణంగా శుభ ఆశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ప్రభావాలు అన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల మార్పులకు దారి తీస్తాయి. అందుకే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రారాజుగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా ఈ సూర్యగ్రహం ఏప్రిల్ 13వ తేదీ రాత్రి మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. ఇదే రాశిలో ఒక నెలపాటు సంచార దశలోనే ఉండబోతోంది. అయితే ఇప్పటికే మీనరాశిలో కుజ గ్రహం ఉండడం వల్ల ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. ఇలా రెండు గ్రహాలు కలవడం కారణంగా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడే అవకాశాలున్నాయి. సూర్య గ్రహం మేషరాశిలో 30 రోజుల పాటు ఉండి ఆ తర్వాత వేరే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ 30 రోజులపాటు కొన్ని రాశుల వారికి బంపర్ లాభాలు కలుగుతాయని అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి:
సూర్యుడి సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి గతంలో ఎప్పుడో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. దీంతోపాటు కెరీర్‌కు సంబంధించిన విషయాలను పురోగతి లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా క్లైంట్ లొకేషన్స్‌లోకి వెళ్లి పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా వీరు విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. అంతేకాకుండా వీరు పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారు.


మేష రాశి:
మేష రాశి వారికి కూడా సూర్యగ్రహం సంచారం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి అదృష్టం పెరగడమే కాకుండా వ్యాపారాల్లో పట్టు సాధిస్తారు. ముఖ్యంగా ఇతర దేశాల్లోని పెద్దపెద్ద కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీంతో పాటు జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా సూర్య భగవానుడి అనుగ్రహం లభించి, అనేక రకాల ఆర్థిక లాభాలు పొందే అవకాశాలున్నాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


మిధున రాశి:
ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సూర్యగ్రహం మేషరాశిలోకి సంచారం చేయడం కారణంగా మిథున రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడటమే, కాకుండా వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. దీంతోపాటు వీరు ఈ సమయంలో కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. అలాగే భార్యతో ప్రేమగా గడిపే సమయం కూడా వస్తుంది.


ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి:
సూర్య గ్రహ నాచారం కారణంగా ఏర్పడే ప్రత్యేక ప్రభావం కన్య ధనుస్సు రాశి వారికి అనేక రకాల దుష్ప్రభావాలను కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని కారణంగా వీరికి ఆర్థికంగా ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా జీవితంలో ఆటంకాలు కూడా ఎదురవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి