Surya Gochar April 2024: మేష రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి కీడు రోజులు ప్రారంభం..
Surya Gochar April 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మే 14వ తేదిన సూర్యగ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Gochar April 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే వ్యక్తిగత జీవితంలో అదృష్టంతో పాటు గౌరవం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అందుకే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రారాజుగా పిలుస్తారు. ఈ సూర్యగ్రహం ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడం వల్ల అన్ని రాశులు ప్రభావితమవుతాయి. అంతేకాకుండా జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి శుభ సమయం కూడా ప్రారంభమవుతుంది. ఈ సూర్యగ్రహం ఏప్రిల్ 13 తేదిన రాత్రి 9.15 గంటలకు మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం మే 14వ తేది వరకు అదే రాశిలో గ్రహ సంచార స్థితిలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి రాబోయే నెల పాటు విపరీతమైన లాభాలతో పాటు కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేషరాశి:
సూర్య గ్రహ సంచారం కారణంగా మేష రాశివారికి ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఈ సమయంలో వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆస్తులకు సంబంధించిన వివాదాల సమస్యలు పెరిగే ఛాన్స్ కూడా ఉన్నాయి. దీని కారణంగా ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు కోపం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మేలు. దీంతో పాటు పనికి రాని చర్చలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది. లేకపోతే సమాజంలో పేరు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది.
సింహ రాశి:
ఈ సంచారం కారణంగా సింహ రాశివారి వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సమయంలో ఒడిదుడులు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా పెరిగి జీవితం ఆందోళనగా మరొచ్చు. దీంతో పాటు మీ ప్రత్యర్థులు కూడా చాలా చురకుగా తయారు కావడం వల్ల కార్యాలయంలో కూడా అనేక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా దెబ్బతినొచ్చు. కాబట్టి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండడం మేలు..
కన్య రాశి:
సూర్యగ్రహ సంచారం ప్రభావం కన్యా రాశివారిపై కూడా పడుతుంది. దీని కారణంగా భయంతో మనస్సు కలత చెందే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరగొచ్చు. కాబట్టి కార్యాలయంలో పనులు చేస్తున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కుంటుంబంలో కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మానసిక సమస్యలు కూడా రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి