Surya Gochar Effect: కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు.. ఈ రాశి వారికి భారీగా ఆర్థిక నష్టాలు..!
Surya Gochar Effect: రేపటి నుంచి శ్రావణమాసం (Sravana) గడియలు మొదలవుతాయి. అయితే జూలై 16న సూర్యుడు తన సొంత రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ తిరోగమనం వల్ల 12 రాశులపై ప్రభావం కనిపిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
Surya Gochar Effect: రేపటి నుంచి శ్రావణమాసం (Sravana) గడియలు మొదలవుతాయి. అయితే జూలై 16న సూర్యుడు తన సొంత రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ తిరోగమనం వల్ల 12 రాశులపై ప్రభావం కనిపిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ 12 రాశుల వారిలో కొన్ని రాశుల వారి లాభాలు వస్తే.. మరికొన్ని రాశుల వారికి నష్టాలు తప్పవని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యుడి సంచారం వల్ల వృశ్చిక రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సూర్యుడు తన రాశిని వదిలి తిరోగమనం చెందుతున్నాడు కావున.. వృశ్చిక రాశి(Scorpio) వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని శాస్త నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఔషధాలను సరైన సమయంలో వాడాలి. ఇలా చేయడం వల్ల వ్యాధులు తీవ్రతరం కాకుండా ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా అధికమని నిపుణులు చెబుతున్నారు. అయితే వీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. వృశ్చిక రాశి(Scorpio) వారు వీలైనంత వరకు ఆరోగ్య కోసం యోగా వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. అయితే ఈ శ్రావణమాసం (Sravana) వీరు శివున్ని పూజించడం వల్ల కొన్ని రకాల శరీర సమస్యలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. వీరు ఏ పని చేసే ముందైనా ఈ సమయంలో ప్రశాంతత పాటించడం మంచిది.
ఇక ఆదాయం విషయానికి వస్తే.. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన నష్టాలు వాటిల్లే అవకాశాలున్నాయి. అయితే వీరు ఈ సమయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉద్యోగం, వ్యాపారం సక్రమంగా నిర్వహించండి. ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా మానీ ట్రాన్సాక్షన్స్ చేయాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
ఈ సమయంలో కుటుంబం, బంధువులు, ఇరుగుపొరుగు, స్నేహితుల మధ్య గొడవలుంటే వెంటనే పరిష్కరించుకోండి. ముఖ్యంగా ఏ విషయంలోనైనా దూకుడుగా ప్రయత్నించకండి. ప్రతి పనిని ప్రశాంతంగా చేయడం వల్ల ఎలాంటి ఆర్థికపరమైన నష్టం జరగదని శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా ఈ సమయంలో వీరిపై పలు రకాల నిందలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కావున అన్నిటి పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో పెద్దలు, స్నేహితులు, సోదరులతో సత్సంబంధాలు పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. ఇతర కుటుంబాల మధ్య విబేధాలుంటే వారితో సంబంధం ఏర్పర్చుకోవడం వల్ల వీరిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
వృశ్చిక రాశి(Scorpio) వారికి ఈ సమయంలో విజయావకాశాలు పెరుగుతాయి. అయితే వీరు నిరుత్సాహపడకుండా అంకితభావంతో పని చేస్తే అన్ని లాభాలు చేకూరుతాయి. ఎదైన ఆర్థిక పరమైన సమస్యలు వస్తే.. శివున్ని ఆరాధించడం మంచిదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
Also Read: Non-Veg in Sawan: శ్రావణమాసంలో ఎందుకు నాన్‌వెజ్ తినకూడదో తెలుసా..?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook