Budhaditya Rajyog 2023: డిసెంబర్ 16 అరుదైన యోగం.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
Budhaditya Rajyog 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. డిసెంబరు 16న సూర్యభగవానుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Surya Gochar in Sagittarius 2023: గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం 12 రాశులలో సూర్యుడు సంచరిస్తాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఈనెల 16న భాస్కరుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే ధను సంక్రాంతి అంటారు. జనవరి 15 వరకు ఆదిత్యుడు ఇదే రాశిలో ఉంటాడు. మెర్క్యూరీ ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నాడు. ధనస్సు రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు రానున్నాయి.
ధనుస్సు: ఇదే రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ధనుస్సు రాశి వారు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు కష్టాల నుండి విముక్తి పొందుతారు.
మేషం: బుధాదిత్య రాజయోగం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
కన్య: సూర్యుడు, బుధుడు కలయిక కన్యా రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆగిపోయిన ప్రమోషన్ మీకు వస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది.
Also Read: Budh Uday 2023: డిసెంబరు 27న ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి