Surya Gochar 2022: కన్యారాశిలోకి సూర్యభగవానుడు... సెప్టెంబర్ 17 నుండి ప్రకాశించనున్న ఈ రాశుల వారి అదృష్టం!
Surya Gochar 2022: సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సూర్య సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది.
Surya Rashi Parivartan 2022: గ్రహాల రాజు సూర్యుడు మరో వారం రోజుల్లో రాశిని మార్చబోతున్నాడు. సెప్టెంబరు 17న సూర్యభగవానుడు తన సొంతరాశి అయిన సింహరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి (Sun Transit in Virgo 2022) ప్రవేశిస్తాడు. సూర్యుని రాశి మార్పు ఉదయం 07:35 గంటలకు జరుగుతుంది. అక్టోబర్ 16 వరకు సూర్యుడు కన్యారాశిలోనే ఉంటాడు. కన్యారాశిలో సూర్య సంచారం 6 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సూర్య సంచారం ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి (Aries) - సూర్యుని సంచారంతో మేష రాశి వారికి సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయి. కెరీర్ లోని అన్ని ఆటంకాలు తొలగిపోయి.. విజయాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు.
కర్కాటక రాశి (Cancer)- కన్యారాశిలో సూర్యుని సంచారం కర్కాటక రాశి వారికి వచ్చే అన్ని రోగాలను నయం చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సమస్యలన్నీ తొలిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది.
తులారాశి (Libra)- సూర్యుడి రాశి మార్పు వల్ల ఈ రాశివారు శుభవార్తలను వినే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు నెరవేరుతాయి. అపారమైన ధనాన్ని పొందుతారు.
వృశ్చికం (Scorpio)- సూర్యుని సంచారం ఈ రాశివారికి ధనలాభాలను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు మీ సంపాదనను పెంచుకుంటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో ఆనందం నెలకొంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius)- సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీనం (Pisces)- సూర్య సంచారం ఈ రాశివారి కెరీర్ లో పురోగతినిస్తుంది. పెట్టుబడి పెట్టడానికి, ఇల్లు, కారు కొనడానికి ఇదే మంచి సమయం. పెళ్లికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: తులరాశిలో కేతు గ్రహ సంచారం... రాబోయే 4 నెలలు ఈ రాశులవారికి కష్టకాలం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook