Surya Grahan 2023: సూర్యగ్రహణం కారణంగా ఈ రాశులవారికి తీవ్ర నష్టాలు తప్పవా? ఇందులో మీ రాశి కూడా ఉందా?
Surya Grahan 2023: సూర్యగ్రహణం కారణంగా పలు రాశువారి జీవితాల్లో తీవ్ర నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో అన్ని రాశులవారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
Surya Grahan 2023: 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 20 ఏప్రిల్ 2023న ఏర్పడబోతోంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయిన కొంత ప్రభావం చూపే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌తో పాటు పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే అవకాశాలున్నాయి. గ్రహణం సమయం ఉదయం 7.04 నిమిషాల నుంచి ప్రారంభమై..మధ్యాహ్నం 12.29 వరకు ఉండబోతోందని సమాచారం.
అయితే ఈ సూర్యగ్రహణం అన్ని రాశులపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. గ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల మేష రాతితో పాటు ఇతర రాశులవారి జీవితాల్లో పెను మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సూర్య గ్రహం వల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి సూర్యగ్రహణం కారణంగా నష్టాలు తప్పవా?:
మేషరాశి:
సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉండడం వల్ల పలు నష్టాలు కలిగే అవకాశాలున్నాయి. ఈ స్థితితో మేష రాశికి కష్టాల యాత్ర ప్రారంభం కానుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారి కెరీర్‌లో ప్రతికూలంగా ప్రభావ పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి కుటుంబ శాంతికి భంగం ఏర్పడబోతోంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితులు మేషరాశిలో బృహస్పతి సంచారం వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
సింహరాశి:
సింహ రాశిని జ్యోతిష్య శాస్త్రంలో సూర్యునిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రాశివారికి కూడా సూర్యగ్రహణం ప్రభావం చూపబోతోంది. సింహ రాశివారికి కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉంటాయి. అంతేకాకుండా మహిళల్లో వెన్నునొప్పి, మెడ నొప్పులు తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. విద్యార్థులైతే చదువుపై దృష్టి తొలగిపోయే అవకాశాలున్నాయి. ప్రేమ జీవితంలో కూడా మార్పులు సంభవించి వైఫల్యాలు కలగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రాశివారికి డిసెంబర్ నెలాఖరు నాటికి అంతా సర్దుకుపోతుంది.
కన్య రాశి:
ఈ రాశికి ఎనిమిదవ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా మానసిక ఒత్తిడి, బాధలు కలుగొచ్చు. వీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే తీవ్ర నష్టాలు జరగవచ్చు. అంతేకాకుండా ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. లేకుంతే ఆ మాటలు ప్రాణాంతకంగానూ మారొచ్చు. ఈ క్రమంలో వ్యాపారాలు చేసేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మకరరాశి:
సూర్యగ్రహణం మకర రాశివారిపై కూడా తీవ్ర ప్రభావం చూపబోతోందని జ్యోతి శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇది తల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.అంతేకాకుండా ఈ క్రమంలో ఖర్చులు పెరిగి లాభాలు కూడా తగ్గుతాయి. బయట ఏదైనా తినడం, త్రాగడం మానుకోండి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దారి తీయోచ్చు.
ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook