Surya Gochar 2024: జనవరిలో అరుదైన యోగం.. వీరు ధనవంతులు అవ్వడం పక్కా...
Surya Gochar 2024 effect: జనవరి నెలలో సూర్యుడు, కుజుడు కలిసి అరుదైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Aditya Mangala Raja Yoga effect: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరమైనా కలిసి రావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే మన ప్యూచర్ ఎలా ఉండాలనేది గ్రహాలు డిసైడ్ చేస్తాయి. ఈ నెలలో సూర్యుడు మరియు అంగారకుడు ధనస్సు రాశిలో సంచరించబోతున్నారు. కీర్తి ప్రతిష్టలకు కారకుడైన ఆదిత్యుడు, ధైర్యాన్ని ఇచ్చే కుజుడు ధనస్సు రాశిలో కలవడం వల్ల అరుదైన ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారిని అదృష్టం వరించనుంది.
మేషరాశి
ఆదిత్య మంగళ రాజయోగం మేషరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఫ్యామిలీతో కలిసి టూర్ కు వెళతారు.
కన్య రాశి
కన్యా రాశి వారికి ఆదిత్య మంగళ రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు పెద్ద మెుత్తంలో ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జాబ్ మారాలనుకునే వారికి ఇదే అనుకూల సమయం. వ్యాపారులు లాభపడతారు. రియల్ ఎస్టేట్లో ఉన్నవారు భారీగా డబ్బులు సంపాదిస్తారు. మీరు కారు కొంటారు.
మీనరాశి
జనవరి నెల మీనరాశి వారికి చాలా బాగుంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. లవ్ సక్సెస్ అవుతోంది. మీ కెరీర్ లో గ్రోత్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లేదా లాటరీ పెట్టుబడిన పెట్టినవారు లాభపడతారు. బిజినెస్ విస్తరిస్తుంది. దారిద్ర్యం పోతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సంతానప్రాప్తి కలుగుతుంది.
Also Read: Mercury Margi 2024: ఈరోజు నుంచి ఈ 3 రాశులకు మంచి రోజులు.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter