Sun Transit 2023: `పితృ దోష యోగం` చేసిన సూర్యుడు-రాహువు.. రాబోయే నెల రోజులుపాటు ఈ 3 రాశులకు ఇబ్బందులు..
Surya Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషరాశిలో సూర్యుడు, రాహువు కలయిక వల్ల పితృ దోష యోగం ఏర్పడింది. ఈ సమయంలో ముఖ్యంగా కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా పరిహారాలేంటో తెలుసుకోండి.
Pitra Dosh Yog Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యభగవానుడు సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. అంటే ఆదిత్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. సూర్యుడి యెుక్క రాశి మార్పునే మనం సంక్రాంతి అంటారు. రీసెంట్ గా మూడు రోజుల కిందట అంటే ఏప్రిల్ 14న సూర్యభగవానుడు మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో దుష్ట గ్రహమైన రాహువు సంచరిస్తున్నాడు. సూర్యుడు, రాహువు కలయిక వల్ల పితృ దోష యోగం ఏర్పడింది. ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
కన్య రాశి
పితృ దోష యోగం సమయంలో ముఖ్యంగా కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశివారు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎటువంటి జంక్ పుడ్ తినవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో టెన్షన్ నెలకొంటుంది.
వృశ్చిక రాశి
సూర్య-రాహు కలయిక వల్ల వృశ్చిక రాశి వారు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కోర్టు కేసులు మిమ్మల్ని చికాకు పెడతాయి. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ సమయంలో అస్సలు పెట్టుబడి పెట్టవద్దు.
కుంభ రాశి
పితృ దోష యోగం కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. లవర్స్ మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Astrology: ఏప్రిల్ 23న కీలక పరిణామం.. ఈ 3 రాశులకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం..
పితృ దోష యోగ నివారణ చర్యలు
** ఇంటి దక్షిణ దిశలో పూర్వీకుల ఫోటో తప్పనిసరిగా పెట్టాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
** నిత్యం పూర్వీకులకు పూలమాలలు సమర్పించడం వల్ల పితృ దోష యోగ ప్రభావం తగ్గుతుంది.
** పూర్వీకులు మరణించిన రోజున.. 21 లేదా అంతకంటే ఎక్కువ మంది బ్రాహ్మణులను ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టండి.
** పేదలకు దానం చేయడం మరియు దక్షిణ ఇవ్వడం శ్రేయస్కరం.
** జ్యోతిష్యుల ప్రకారం, చతుర్దశి నాడు రావి చెట్టుకు పాలు పోయండి.
** దక్షిణ దిక్కున పూర్వీకుల పేరిట దీపం వెలిగించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులయి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.
Also read: Surya Grahan 2023: వైశాఖ అమావాస్య నాడే తొలి సూర్యగ్రహణం, ఈ నిజాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.