Surya Rashi Parivartan 2023: జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని విజయం, ఆరోగ్యం మరియు విశ్వాసానికి కారకుడిగా భావిస్తారు. సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని ఛేంజ్ చేస్తాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న సూర్యదేవుడు ఏప్రిల్ 14 వరకు అక్కడే ఉంటాడు. సూర్యుడి యెుక్క సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడి సంచారం ఈ రాశులకు వరం
వృషభం: వృషభ రాశి వారికి సూర్య సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అన్ని సమస్యలను అధిగమించి ఆర్థిక పురోగతి సాధిస్తారు. మీ కెరీర్‌లో గొప్ప పురోగతి ఉంటుంది. ఉన్నత పదవులు, గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 
మిథునం: సూర్యుని సంచారం మిథున రాశి వారికి గౌరవాన్ని ఇస్తుంది. ఉద్యోగం చేసే వారికి ఈ సమయం బాగానే ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. 
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారం చాలా మేలు చేస్తుంది. మీకు ప్రతి పనిలో ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటంది. ఉద్యోగ మరియు వ్యాపారాలకు ఇదే అనుకూల సమయం.


తుల: సూర్యుని సంచారం తులారాశి వారికి విజయాన్ని చేకూరుస్తుంది. ఈ సమయంలో శత్రువులు ఓడిపోతారు, వృత్తిలో పురోగతి సాధిస్తారు. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. వీరికి ఏప్రిల్ 14 వరకు సమయం చాలా బాగుంటుంది.
వృశ్చికరాశి: సూర్యుడి గోచారం వృశ్చికరాశి వారికి వ్యాపారంలో అధిక లాభాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
ధనుస్సు: ఏప్రిల్ 14 వరకు ధనస్సు రాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Also Read: surya grahan 2023: సూర్యగ్రహణంతో ఈ రాశులకు మహార్దశ... ఇందులో మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook