Surya Transit In Makar Rashi 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అంటారు. నూతన సంవత్సరంలో సూర్యదేవుడు తన రాశిని మార్చనున్నాడు. జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి (Surya Transit In Capricorn 2023) ప్రవేశించనున్నాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడి సంచారం మూడు రాశులవారికి అపారమైన ధనాన్ని పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనం (Pisces): సూర్యుని సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యదేవుడు మీ రాశి నుండి 11వ ఇంట్లోకి సంచరించబోతున్నాడు. అదృష్టం మీకు కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. మీరు డబ్బును ఆదా చేస్తారు. ఉద్యోగులకు కూడా ఈ టైం బాగానే ఉంటుంది. 


మిథునం (Gemini): సూర్య గ్రహ సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి ఎనిమిదో ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ సమయంలో పరిశోధనా రంగంతో అనుబంధం ఉన్నవారు విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం పొందుతారు. మీరు పచ్చ రాయిని ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


తుల రాశి (Libra): సూర్యభగవానుడి రాశి మార్పు తుల రాశి వారికి ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యదేవుడు మీ జాతకంలోని నాల్గవ ఇంట్లో సంచరించబోతున్నాడు. అందుకే ఈ సమయంలో మీరు భౌతిక సుఖాలను పొందే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డీలర్లుగా పనిచేసే వారు ఈ సమయం బాగుంటుంది. అదే విధంగా ఈ టైంలో మీరు ఏదైనా వాహనం లేదా మరేదైనా విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేయవచ్చు.


Also read: Shukra Gochar 2023: మీన రాశిలోకి శుక్రుడు... ఈ 3 రాశుల వారి ఇంటి నిండా సిరి సంపదలు ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.