Sun Transit 2022: వృశ్చికంలోకి సూర్యుడి ప్రవేశం... ఈ 6 రాశులవారికి అపారమైన ధనం..
Sun Transit 2022: సూర్యుని రాశిలో మార్పునే సంక్రాంతి అంటారు. సూర్యుడు నిన్న వృశ్చిక రాశిలో ప్రవేశించాడు. సూర్య సంచారం ఏ రాశులవారిపై సానుకూలం ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
Sun Transit in Scorpio 2022: నవంబర్ 16వ తేదీ బుధవారం రాత్రి 7.15 గంటలకు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. దీనినే వృశ్చిక సంక్రాంతి అంటారు. సూర్యుని రాశిలో మార్పునే సూర్య సంక్రాంతి అంటారు. సూర్యుడి యెుక్క ఈ సంచారం (Sun transit in Scorpio 2022) వల్ల కొన్ని రాశులవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సూర్య సంక్రాంతి ఏ రాశులవారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం.
కర్కాటకరాశి (Cancer): వృశ్చికరాశిలో సూర్యుడి సంచారం వల్ల ఈ రాశికి చెందిన విద్యార్థులు విజయం సాధిస్తారు. ఈ సమయం మీకు ఆర్థికంగా లాభిస్తుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
సింహరాశి (Leo): వృశ్చిక రాశిలో సూర్యుని సంచారం సింహ రాశి వారికి మేలు చేస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీరు ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఆర్థికంగా మీరు బలపడతారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది.
తులారాశి (Libra): తులారాశి వారికి వృశ్చికరాశిలో సూర్యుని సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు డబ్బు ఆదా చేస్తారు. కుటుంబం మద్దతు మీకు లభిస్తుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారం మీకు లాభాలను ఇస్తుంది. ఆర్థికంగా మీ పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
వృశ్చికరాశి (Scorpio): ఈ రాశిలోనే సూర్యుడి సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్యుడి రాశి మార్పు ఈ రాశివారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
కుంభరాశి (Aquarius): కుంభ రాశి వారికి వృశ్చిక రాశిలో సూర్యుని సంచారం బాగుంటుంది. మీ ఆదాయం బాగుంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. అంతేకాకుండా మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఫ్యామిలీ నుండి సపోర్టు లభిస్తుంది.
మీనం (Pisces): సూర్యుడి సంచారం వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. మీ యెుక్క ఆసక్తి ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కల నెరవేరుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
Also Read: Grah Gochar 2022: నవంబర్‌లో అరుదైన యోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook