Dream Astrology: మీకు కలలో ఇవి కనిపించియా? అయితే మీరు త్వరలో కోటీశ్వరులవుతున్నట్లే..!
Dream Astrology: రోజూ మనకు ఎన్నో కలలు వస్తుంటాయి.అందులో కొన్ని కలల మనల్ని ధనవంతుల్ని చేయవచ్చు. ఆ డ్రీమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Dream Astrology: మనకు నిద్దట్లో ఎన్నో కలల వస్తూంటాయి. ఇవి మంచివి అయినా కావచ్చు లేదా చెడ్డవైనా కావ్చచు. ఈ కలలకు గల అర్థాలు గురించి స్వప్నశాస్త్రంలో (Dream Astrology) చెప్పబడ్డాయి. దీని ప్రకారం మంచి కలల వస్తే ఎవరికీ చెప్పకూడదంట. ఒకవేళ చెబితే ఆ కల నెరవేరదు. చెడ్డ కలల వస్తే వీలైనంత ఎక్కువ మందికి చెప్పాలంట. ఇలా చేయడం వల్ల చెడు ఫలితాలను వదిలించుకోవచ్చు. మీకు ఏ కలలు వస్తే డబ్బు ఎక్కువగా వస్తుందో తెలుసా?
కలలో ఏనుగును చూడటం: డ్రీమ్ లో ఏనుగును చూడటం చాలా శుభప్రదం. దీని వల్ల మీరు అపారమైన డబ్బును పొందుతారు. అంతేకాకుండా మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కలలో తామర పువ్వును చూడటం: కలలో తామర పువ్వును చూడటం చాలా మంచిది. అదే తెల్లని తామరపువ్వు కనిపిస్తే అపారమైన సంపద వస్తుందని అర్థం. మీపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందనడానికి ఇది ఒక సూచన.
కలలో కరెన్సీని చూడటం: కలలో కరెన్సీ కనిపించినట్లయితే.. మీకు త్వరలో లాటరీ తగలుతుందని అర్థం. అంటే ఎక్కడి నుంచైనా సడన్ గా డబ్బు రావచ్చు.
కలలో పండ్ల చెట్టు వస్తే: మీ కలలో పండ్ల చెట్టు కనిపిస్తే.. అది చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపారస్థులకు ఇలాంటి క వస్తే లక్కీ. ఎందుకంటే వారి బిజినెస్ విస్తరించడమే కాకుండా అపారమైన సంపదను గడిస్తారు.
కలలో తెల్లని పాము కనిపించిందంటే: కలలో పాము కనిపిస్తే మంచిది. అయితే శ్వేతనాగు కనిపిస్తే...మీకు చాలా డబ్బు వస్తుందని అర్థం. అంతేకాకుండా మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని ఈ కల చెబుతుంది.
Also Read: Shadashtak Yog: త్వరలో శని-శుక్ర 'షడష్టక యోగం'.. ఈ 4 రాశులవారి లైఫ్ ఖతం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook