Shani Sade Sati 2023: శని సడేసతి, ధైయాల నుంచి విముక్తి.. 2 రోజుల తర్వాత ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్!
These 3 Zodiac Signs will get Golden Days from 17th January 2023 due to Saturn Transit in Aquarius 2023. 2023 జనవరి 17న మకర రాశి నుంచి కుంభ రాశికి శని సంచరించనున్నాడు.
Golden Days Starts to Sagittarius, Libra and Gemini Zodiac Signs after get freedom from Shani Sade Sati 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం... శని దేవుడిని 'కర్మ దాత' అంటారు. మనుషులకు వారి మంచి మరియు చెడు కర్మలను బట్టి శని ఫలాలను ఇస్తాడు. శని దేవుడు 30 ఏళ్ల తర్వాత తన సొంత రాశిలోకి మారబోతున్నాడు. 2023 జనవరి 17న మకర రాశి నుంచి కుంభ రాశికి సంచరించనున్నాడు. శని తన రాశిని మార్చిన వెంటనే.. కొన్ని రాశులపై సడేసతి ప్రారంభమవుతుంది. అయితే కొందరికి సడేసతి నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో శని యొక్క సడేసతి మరియు ధైయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. శని యొక్క సడేసతి మరియు ధైయాల సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 2023 జనవరి 17న కుంభ రాశిలోకి శని సంచరిస్తాడు. దాంతో ఏ రాశికి చెందిన వ్యక్తులు శని యొక్క సడేసతి మరియు ధైయాల నుంచి స్వేచ్ఛ పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
శని దేవుడు మానవులకు వారి కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. ఈ కారణంగానే శని గ్రహం యొక్క సడేసతి మరియు ధైయాలు చాలా బాధాకరమైనవిగా పరిగణించబడతాయి. శని సడే సతి ఏడున్నరేళ్లు, ధైయా ప్రభావం రెండున్నరేళ్ల వరకు ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శని యొక్క కదలిక అన్ని గ్రహాలలో నెమ్మదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో జనవరి 17న జరగబోయే శని సంచారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.
2023 జనవరి 17న శని దేవుడు రాశిని మారుస్తాడు. మకర రాశి నుంచి కుంభ రాశిలో శని ప్రవేశించిన వెంటనే.. ధనుస్సు రాశి వారికి సడే సతి తొలగిపోతుంది. అదే సమయంలో తులా రాశి, మిధున రాశి వారికి కూడా శని దశ ముగుస్తుంది. ఈ రాశుల వారికి మరో రెండు రోజులో గోల్డెన్ డేస్ ప్రారంభం అవుతాయి. ఈ 3 రాశుల వారు తమ పనుల్లో విజయం సాధించడం ప్రారంభిస్తారు. దీనితో పాటు అదృష్టం కూడా తోడవుతుంది.
Also Read: Rashi Khanna Pics: లిమిట్స్ క్రాస్ చేసేసిన రాశి ఖన్నా.. హాట్ స్టిల్స్ చూస్తే మతిపోవాల్సిందే!
Also Read: Jupiter Rise 2023: అరుదైన ధన రాజయోగం.. ఈ 3 రాశుల వారికి 'ప్రతిరోజూ పండగే'! ఇంటి నిండా నోట్ల కట్టలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.