These 3 Zodiac Signs Will get Inexhaustible Money and Promotion in Job due to Mars Transit 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో తమ రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపుతుంది. 2023 మార్చి 13న అంగారక గ్రహం (కుజుడు) మిధున రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని ప్రభావం అన్ని రాశి చక్ర గుర్తుల స్థానికుల జీవితంపై చూపుతుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. తరగని ధనం సొంతమయ్యే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యా రాశి:
కన్యా రాశి వారికి అంగారకుడి సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి నుంచి అంగారకుడు చర్య కోణంలో సంచరించబోతున్నాడు. దాంతో నిరుద్యోగులు ఈ సమయంలో కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ కాలంలో విజయం సాధించగలరు. తండ్రి నుంచి సహకారం మరియు ప్రయోజనాలు అందుతాయి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారవేత్తలు ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభిస్తుంది.


తులా రాశి:
కుజుడి రాశి మార్పు తులా రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. ఈ రాశి వారు అదృష్ట స్థానానికి వెళ్లబోతున్నారు. ఈ సమయంలో విదేశాలలో చదువుతున్న విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. గతంలో నిలిచిపోయిన పని పూర్తవుతుంది. కార్యాలయంలో అధికారులతో మంచి సమన్వయం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం ఉంటుంది.


వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి అంగారకుడి సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడి ఇప్పుడు లాభిస్తుంది. వ్యాపారవేత్తలు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది.  


Also Read: Somvati Amavasya 2023: సోమవతి అమావాస్య 2023.. ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!


Also Read: Xiaomi 13 Pro: షియోమీ నుంచి సూపర్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌.. నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్! లాంచ్ చేయడానికి ముందే లీకైన ధర


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.