These 4 zodiac signs to get Huge Money and Lot of Happiness due to Raja Yoga 2023: కొత్త సంవత్సరం (2023) ప్రారంభం కాగానే చాలా గ్రహాలు తమ రాశి చక్రాన్ని మార్చనున్నాయి. ఈ క్రమంలోనే 2023 ప్రారంభంలో కుంభ రాశిలోకి శని గ్రహం ప్రవేశిస్తుంది. దాంతో మహా రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం సమయంలో శని గ్రహం నుంచి పలు రాశుల వారు విశేష ప్రయోజనాలు పొందుతారు. నూతన సంవత్సరంలో శని దేవుడు కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వబోతున్నాడు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశిలో శని సంచారం.. కర్కాటక రాశి వారికి విశేష ప్రయోజనాలను అందించబోతోంది. శని దేవుడు కర్కాటక రాశిలోని ఎనిమిదవ ఇంట్లో జనవరి 17న సంచరించబోతున్నాడు. దాంతో శని రాజయోగం సృష్టిస్తున్నాడు. రాజకీయాలలో ఉన్న కర్కాటక రాశి వ్యక్తులకు మేలు జరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. చాలాకాలంగా రాని డబ్బు తిరిగి వస్తుంది.


కన్యా రాశి:
కన్యా రాశిలోని ఆరవ ఇంట్లోకి శని దేవుడు సంచరించబోతున్నాడు. దాంతో కన్యా రాశి వారికి కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. పాత రుణాలు మరియు దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు కూడా ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. పలువురికి ఉద్యోగంలో మార్పు మరియు వ్యాపారంలో పురోగతికి ఉంటుంది.


ధనుస్సు రాశి:
ధనుస్సు రాశిలో మూడవ ఇంట్లోకి శని సంచరించబోతున్నాడు. దాంతో ఈ సంవత్సరారంభంలో ధనుస్సు రాశి వారికి సాడే సతి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏడాది పొడవునా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి.


మీన రాశి:
మీన రాశి చక్రంలోని పన్నెండవ ఇంట్లో శని సంచరించబోతున్నాడు. దాంతో ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. దీర్ఘకాలంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. 


Also Read: తులసి, మనీ ప్లాంట్‌లను ఇంట్లో ఈ దిక్కున పెడితే అష్టదరిద్రం.. లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్లిపోతుంది!  


Also Read: FIFA World Cup 2022: సెమీస్‌లో మొరాకో చిత్తు.. ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ఫ్రాన్స్‌! రికార్డులు ‍బ్రేక్‌  


-  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.