These 4 Zodiac Signs will face heavy problems after Shukra Gochar 2022: జ్యోతిష్యశాస్రం ప్రకారం... ఆనందం, శారీరక సుఖాలకు శుక్ర గ్రహం కారకుడని చెప్పబడింది. శుక్రుని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే.. మరోకొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి. 2022 సంవత్సరంలో చివరి సంచారం డిసెంబర్ 29న ఉంటుంది. మకర రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మకర రాశిలో శని గ్రహం ఉన్నాడు. దాంతో ఈ శుక్ర సంచారం ఈ నాలుగు రాశుల జీవితాలలో తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తుంది. శుక్ర సంచారం సమయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యా రాశి:
మకర రాశిలో శుక్రుని సంచారం వల్ల కన్యా రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. శత్రువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. అంతేకాదు వివాదాలకు దూరంగా ఉండాలి. మకర రాశి వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాల కోసం ఎలాంటి అనైతిక మరియు చట్టవిరుద్ధమైన పనిని చేయకుండా ఉండాలి. మీరు ఇలా చేస్తే ఫలితం ఉండదు.


తులా రాశి: 
2022లో చివర గ్రహ సంచారం వలన తులా రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. తెలియని వస్తువులు ఏదైనా సరే కొనడం మానుకోండి. మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో కొనుగోలు చేసిన వస్తువుల ద్వారా సంతృప్తి చెందలేరు. ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగేయాలి. 


మకర రాశి:
శుక్రుడు డిసెంబర్ 29న మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దాంతో ఈ రాశి చక్రం ప్రజలు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోబుట్టువులతో సంబంధాలు చెడిపోతాయి. డబ్బుకు సంబంధించి సంబంధాలకు దూరం ఉండాలి. ఓపికతో పనిచేస్తేనే ఫలితం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. 


మీన రాశి:
మీన రాశి వారికి శుక్ర సంచారం సవాలుగా ఉంటుంది. ఈ సమయంలో చెడు ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కడుపు సంబంధిత వ్యాధులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. 


Also Read: Venus Transit 2023: మాలవ్య రాజ్యయోగం.. కొత్త సంవత్సరంలో ఈ 3 రాశుల వారు పట్టుకున్న ప్రతీది బంగారమే!


Also Read: Wednesday Shopping Tips: బుధవారం షాపింగ్‌కి వెళుతున్నారా.. ఈ వస్తువులను మాత్రం అస్సలు కొనొద్దు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.