These 4 Zodiac Signs Will get immense money in Day and Night due to Mercury Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ప్రతి నెలా పెద్ద గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. 2023 ఫిబ్రవరి నెలలో కూడా పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చుకున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే బుధుడు సంచరించాడు. ఫిబ్రవరి 27న బుధుడు మరోసారి సంచరిస్తాడు. కుంభ రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. శని సొంత రాశి అయిన కుంభ రాశిలో బుధుని సంచారం అరుదైన రాజయోగాన్ని సృష్టిస్తుంది. కుంభ రాశిలో ఏర్పడిన ఈ రాజయోగం అనేక రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధున రాశి:
2023 సంవత్సరంలో కుంభ రాశిలో ఏర్పడే ఈ రాజయోగం మిథున రాశి వారికి ప్రత్యేకంగా మేలు చేస్తుంది. ఈ యోగం వలన ఈ రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. 2023 సంవత్సరంలో మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఉద్యోగస్తులకు కెరీర్‌లో ప్రమోషన్ లభిస్తుంది.


ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి బుధ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. ఈ రాజయోగం ధనుస్సు రాశి వ్యక్తుల కుటుంబ జీవితంలో, ప్రేమ జీవితంలో మరియు న్యాయపరమైన విషయాలలో విజయం ఉంటుంది. గతంలో వెనక పడిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. 


కన్యా రాశి:
కన్యా రాశి వారికి బుధ సంచారం వలన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో కన్యా రాశి వ్యక్తుల ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఉద్యోగస్తులు తమ కెరీర్‌లో ప్రమోషన్ పొందవచ్చు. అదే సమయంలో రేడియో, యోగా వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా ఉంటుంది. 


మకర రాశి:
కుంభ రాశిలో బుధుడు సంచరించడం వల్ల ఏర్పడే రాజయోగం మకర రాశి వారికి విశేష ఫలప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మకర రాశి వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సామాజిక స్థాయిలోనూ ఉన్నతంగా ఎదుగుతారు. పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలో మీరు లాభాలను పొందవచ్చు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది.


Also Read: Mahashivrari 2023: మీ కోరిక నెరవేరాలంటే.. మహా శివరాత్రి నాడు ఈ 10 పరిహారాల్లో ఏదో ఒకటి 'ఒక్కటైనా' చేయండి!


Also Read: Rahu Mahadasha 2023: 18 సంవత్సరాల రాహు మహాదశ.. వీరికి పేదరికం తప్పదు! ఈ నివారణ చర్యలు చేయండి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.