Rahu Mahadasha 2023: 18 సంవత్సరాల రాహు మహాదశ.. వీరికి పేదరికం తప్పదు! ఈ నివారణ చర్యలు చేయండి

These Peoples will Get Heavy Money due to 18 Years of Rahu Mahadasha. రాహువు మహాదశ కూడా ఏదో ఒక గ్రహం యొక్క ఉపకాలంతో పాటు కొనసాగుతుంటే.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 18, 2023, 08:09 AM IST
  • 18 సంవత్సరాల రాహు మహాదశ
  • వీరికి పేదరికం తప్పదు
  • ఈ నివారణ చర్యలు చేయండి
Rahu Mahadasha 2023: 18 సంవత్సరాల రాహు మహాదశ.. వీరికి పేదరికం తప్పదు! ఈ నివారణ చర్యలు చేయండి

These Peoples will face Huge Problems due to 18 Years of Rahu Mahadasha: 'రాహువు' ఛాయాగ్రహం అయినప్పటికీ.. ప్రాముఖ్యత మాత్రం ఇతర గ్రహాల మాదిరిగానే ఉంటుంది. రాహువు దృష్టి తొమ్మిదవ, సప్తమ మరియు ఐదవ గృహాలలో ఉంటుంది. రాహువు మహాదశ చాలా కష్టాలను తెస్తుంది. రాహువు మహాదశ ఏకంగా 18 సంవత్సరాలు ఉంటుంది. రాహువు మహాదశ కూడా ఏదో ఒక గ్రహం యొక్క ఉపకాలంతో పాటు కొనసాగుతుంటే.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రాహువు మహాదశలో వివిధ గ్రహాల ఉపకాల ప్రభావం ఏమిటో మరియు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రాహువులో శని:
రాహువులో శని అంతర్దశ కాల వ్యవధి 2 సంవత్సరాల 10 నెలల 6 రోజులు. దీంతో కుటుంబంలో మనస్పర్థలు తలెత్తి విడాకుల దాకా వెళతాయి. ప్రమాదాలు, గాయాలు మరియు చెడు సహవాసంలోకి జారుకునే అవకాశం ఉంది. అందుకే శువుడికి శమీ ఆకులను సమర్పించి పూజించండి. మహామృత్యుంజయ మంత్రాన్ని బ్రాహ్మణునితో జపించండి.

రాహువులో బుధుడు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... రాహువులో బుధుడు అంతర్దశ 2 సంవత్సరాల 3 నెలల 3 రోజులు. ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సంపదలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. అదే సమయంలో సమాజంలో గౌరవం పెరుగుతుంది. పక్షులకు పచ్చి  పప్పు పెట్టడం.. ఏనుగుకు కొబ్బరి చిప్పలు, పచ్చి ఆకులు లేదా బెల్లం తినిపిస్తే ఇంకా మంచిది. 

రాహువులో కేతువు:
రాహువులో కేతువు అంతర్దశ ఒక సంవత్సరం 18 రోజులు. ఇది చాలా చాలా క్లిష్ట పరిస్థితి. ఈ కాలంలో అగ్ని ప్రమాదం, శత్రువుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్వరం, శారీరక నొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. కుక్కలకు బిస్కెట్లు, రొట్టెలు.. కాకులకు ఖీర్ తినిపిస్తే సమస్యలు దూరమవుతాయి. భైరవుని ఆలయంలో ధ్వజాన్ని సందర్శించండి.

రాహు మహాదశలో శుక్రుని అంతర్దశ:
శుక్రుని అంతర్దశ రాహువులో మూడు సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. భూమి, వాహన, విలాస వస్తువులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మరియు రాహువు లాభదాయకంగా లేకుంటే.. అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జలుబు మరియు ఇతర వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. దీనికి పరిహారంగా నందిని పూజించండి. ఎద్దుకు బెల్లం లేదా గడ్డి తినిపించండి. రైన్‌స్టోన్ పూసలు ధరిస్తే మంచిది.

Also Read: Maha Shivaratri 2023: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు!  

Also Read: Karachi Terrorist Attack: పోలీసు కార్యాలయంపై తాలిబన్ల దాడి.. కరాచీలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News