Mercury Transit 2023: మిథునంలోకి బుధుడు ఈ రాశులవారు జాక్ పాట్ కొట్టడం ఖాయం!
Transit of Mercury 2023: బుధుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారు జాక్ పాట్ కొట్టబోతున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచార ప్రభావంతో కొన్ని రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందితే మరికొన్ని రాశుల దుష్ప్రభావాల కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారు.
Transit of Mercury on June 24 2023: ప్రతి నెలలో ఏదో ఒక గ్రహం రాశి సంచారం చేస్తూనే ఉంటుంది. ప్రక్రియకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జూన్ 24వ తేదీన బుధుడు వృషభరాశిని వదిలి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం కారణంగా అన్ని రాశుల వారి జీవితాల్లో చాలా రకాల మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడి సంచారం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సంచారం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో.. ఏయే రాశుల వారు జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారు ప్రయోజనాలు పొందడం ఖాయం:
మేషరాశి:
బుధుడి సంచారం కారణంగా మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మనసు ప్రశాంతంగా మారి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు పొందడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.
వృషభం రాశి:
ఈ రాశి వారు సోమరితనం కారణంగా పలు ఇబ్బందులకు గురవుతారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే.. ఈ సంచార క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు పొందుతారు. ఈ క్రమంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
మిథున రాశి:
బుధుడు మిథున రాశిలోకే సంచారం చేయబోతున్నాడు కాబట్టి.. ఈ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉండవచ్చు. ఈ రాశి వారికి ఈ నెల మొత్తం ఖర్చులన్నీ తగ్గి ఆదాయం పెరిగే ఛాన్స్ కూడా ఉంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఒత్తిడి కారణంగా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా లోపిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఈ సంచారం కారణంగా కలిసి వస్తుంది. వాహనాలు కొనుగోలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
సింహ రాశి:
బుధుడి సంచారం కారణంగా సింహ రాశి వారికి ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ సంచారం కారణంగా గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఇంటర్వ్యూలో విజయాలు సాధిస్తారు.
Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్‌న్యూస్, ఉద్యోగుల జీతం 26 వేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook