Bad Luck: మీ ఇంటి ముందు ఈ 5 వస్తువులు ఉంటే ధనలక్ష్మి ఇంట్లోకి రాదు.. వెంటనే తీసేయండి.
Bad Luck for home: వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంటికి ఆర్థిక సంక్షోభం చుట్టుకుంటుంది. అంతేకాదు నెగెటివిటీకి కూడా కారణమవుతుంది. దీంతో ఆ ఇంట్లో ఉన్నవారికి బ్యాడ్ లక్ మొదలవుతుంది.
Bad Luck for home: వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంటికి ఆర్థిక సంక్షోభం చుట్టుకుంటుంది. అంతేకాదు నెగెటివిటీకి కూడా కారణమవుతుంది. దీంతో ఆ ఇంట్లో ఉన్నవారికి బ్యాడ్ లక్ మొదలవుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో 5 వస్తువులు ఉండటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం. అందుకే వెంటనే వాటిని ఈరోజే తీసేయండి.
పని చేయని వాచీ..
ఇంట్లో మనం సమయం చూసుకోవాలి అంటే వాచీ పెట్టుకుంటాం. అయితే ఇంట్లో గోడకు పెట్టినా వాచీ పనిచేయకపోతే దాన్ని వెంటనే తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే పగిలిన వాచ్ ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. దీంతో ఇంట్లో అశాంతి బాడ్ లక్ మొదలవుతుంది. ఏ పని చేసినా విజయం పొందలేరు. ఇది ఇంటికి ఆర్థిక సంక్షోభానికి దారి ఇస్తుంది. ఇంట్లో వాచి పనిచేయకపోతే వెంటనే రిపేర్ చేయించండి, పగిలిపోతే కొత్త వాచ్ తెచ్చి పెట్టుకోండి.
పగిలిన పాత్రలు..
అంతేకాదు వాస్తు ప్రకారం ఇంట్లో పగిలిపోయిన వంట పాత్రలను కూడా ఉపయోగించకూడదు. మీరు తినే ఆహారం ప్లేటు వంటివి పాత్రలు ఇంట్లో పగిలినవి వాడకూడదు. ఇది ఇంటికి నెగిటివిటీ తీసుకొస్తుంది. రిలేషన్ షిప్‌లో బ్రేకప్‌కు కూడా కారణం అవుతుంది. ఇంట్లో అశాంతి మొదలవుతుంది.
ముళ్లచెట్టు..
ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇంటికి శుభాన్ని ఇస్తే, మరికొన్ని రకాల మొక్కలు పెట్టుకుంటే ఆశుభాన్ని ఇస్తాయి. ఇంట్లో ముళ్ల చెట్లు అస్సలు పెట్టుకోకూడదు. ఇది ఇంటికి నెగిటివిటీని తీసుకువస్తాయి. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలంటే ముళ్ళ మొక్కలు ఇంటిలోంచి తీసేయండి.ఇంట్లో కేవలం తులసి కలబంద, మనీ ప్లాంట్ మొక్కలను పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: పడుకునేటప్పుడు దిండు చుట్టూ ఖాళీగా ఎందుకు ఉంచాలి? తప్పక తెలుసుకోండి..
విరిగిన ఫర్నిచర్..
అంతేకాదు వాస్తు ప్రకారం ఇంట్లో విరిగిపోయిన ఫర్నిచర్ కూడా పెట్టుకోకూడదు. ఇవి చెక్కతో చేసినవి ఉంటాయి. కాబట్టి విరిగిపోయిన ఫర్నిచర్ వల్ల ఇంటికి ఆర్థిక సంక్షోభం వస్తుంది. అందుకే వీటిని కూడా వెంటనే రిపేర్ చేయించుకోవాలి లేకపోతే కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఈ ఫెంగ్‌షుయ్ వస్తువు మీ ఇంట్లో ఉంటే నెగిటీవ్ ఎనర్జీకి చోటే ఉండదు..
చనిపోయిన మొక్కలు..
వాస్తు ప్రకారం ఇంట్లో చనిపోయిన మొక్కలు ఉంటే కూడా ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. ఇంట్లో ఉన్నవారికి దరిద్రం చుట్టుకుంటుంది. ఇంట్లో మొక్కలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఆ పొరపాటు జరిగితే వెంటనే తీసివేసి వేరే మొక్కను తెచ్చి పెట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేచి ఆ వాడిపోయిన మొక్కలను చూడకూడదు. ఇది ఇంటికి అశాంతిని తీసుకువస్తుంది నెగిటివిటీ కి కారణం అవుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter