Devshayani Ekadashi or Tholi Ekadashi 2022: నేడే (జూలై 10, 2022 ఆదివారం) తొలి ఏకాదశి. తెలుగులోగిళ్లలో తొలి ఏకాదశికి (Tholi Ekadashi 2022) ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏకాదశినే శయన ఏకాదశి, దేవశయని ఏకాదశి అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. ఈ రోజు నుంచే శ్రీమహావిష్ణువు 4 నెలలపాటు యోగ నిద్రలోకి వెళ్లి.. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని (Lord Vishnu) పూజిస్తారు. ఈ రోజు ఏ శుభకార్యాలు చేయాలి, ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏకాదశి నాడు గుర్తించుకోవాల్సినవి:
>> దేవశయని ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి. విష్ణువుకు పసుపు చాలా ప్రీతికరమైనది. శ్రీహరిని పువ్వులతో అలంకరించి.. దేవుడి ముందు స్వీట్లు పెట్టండి. 
>> తొలి ఏకాదశి రోజున కూడా పొరపాటున కూడా నాన్ వెజ్ తినకండి. అంతేకాకుండా మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి తీసుకోకండి.  
>> ఏకాదశి నాడు గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు. ఏకాదశి నాడు సబ్బు, నూనె, డిటర్జెంట్ పౌడర్ వాడకూడదు.
>>  ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా అన్నం తినకూడదు. 
>>  ఏకాదశి రోజున ఎవరికి హాని తలపెట్టవద్దు, అబద్దాలు అడవద్దు, చెడు ఆలోచనలు చేయవద్దు.  
>>  ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించండి.
>>  ఈ రోజున మీకు తోచిన విధంగా పేదలకు దానం చేయండి.


Also Read: Ekadashi 2022: ఇవాళ తొలి ఏకాదశి.. నేటి నుంచే చాతుర్మాసం... ఈ పండగ తిథి, ప్రాముఖ్యత ఇతరత్రా విశేషాలివే...



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook