Ratha Sapthami: కోవిడ్ మహమ్మారి ప్రభావం తిరుమల శ్రీవారిపై పడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారి..బ్రహ్మోత్సవాల్ని ఒకరోజుకు పరిమితం చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రతియేటా సూర్యజయంతి రోజున రధసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా శ్రీవారి ఆలయంలో అన్నీ ఏకాంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్, కరోనా థర్ద్‌వేవ్ నేపధ్యంలో అన్ని ఆర్జిత సేవల్ని రద్దు చేసింది టీటీడీ. కరోనా మహమ్మారి కారణంగానే శ్రీవారి ఉత్సవాల్ని గత రెండేళ్లుగా భక్తులకు దూరంగా కేవలం ఆలయంలో ఏకాంతంగా జరుపుతున్నారు. 2021లో కూడా బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాల్ని ఏకాంతంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకల్ని మాత్రం భక్తుల సమక్షంలోనే నిర్వహిస్తున్నారు. 


ఈసారి మాత్రం పరిస్థితి అలా లేదు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో రథ సప్తమి వేడుకల్ని(Ratha Sapthami) ఏకాంతంగా నిర్వహించాలనేది టీటీడీ నిర్ణయం. రథసప్తమి వేడుకల్ని ఏకాంతంగా నిర్వహించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే తొలిసారి. రథసప్తమి వేడుకల్ని శ్రీవారి ఆలయంలో ఒకరోజు బ్రహ్మోత్సవం లేదా మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారిని 9 రోజులపాటు 16 వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగిస్తూ..భక్తుల సందర్శనార్ధం తిప్పుతారు. రథసప్తమినాడు శ్రీవారిని సప్తవాహనాలపై తీసుకెళ్తూ..భక్తులకు దర్శనం కల్గిస్తారు. ఈ వేడుకలన్నీ తెల్లవారుజాము నుంచే ప్రారంభం కానున్నాయి. 


Also read: Vasantha Panchami 2022: నేడు వసంత పంచమి.. బాసర సరస్వతీ ఆలయంకు పోటెత్తిన భక్తులు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook