Vasantha Panchami 2022: నేడు వసంత పంచమి.. బాసర సరస్వతీ ఆలయంకు పోటెత్తిన భక్తులు!!

Vasantha Panchami 2022: నేడు వసంత పంచమి అవడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ మాతా దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2022, 06:40 AM IST
  • నేడు వసంత పంచమి
  • బాసర సరస్వతీ ఆలయంకు పోటెత్తిన భక్తులు
  • అమ్మవారి దగ్గర అక్షరాభ్యసం
Vasantha Panchami 2022: నేడు వసంత పంచమి.. బాసర సరస్వతీ ఆలయంకు పోటెత్తిన భక్తులు!!

Vasantha Panchami 2022: ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ ఏడాది వసంత పంచమి ఈ రోజే (ఫిబ్రవరి 5వ). రోజు భారత దేశంలోని ప్రజలకు ఎంతో విశిష్టమైన రోజు. ఎందుకంటే.. ఆ రోజు చదువుల తల్లి సరస్వతి దేవిని ప్రతిఒక్కరు భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, గురువులు. అంతేకాదు వసంత పంచమి రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది.

ఫిబ్రవరి 5 (శనివారం) ఉదయం 3.48 గంటలకు వసంత పంచమి ప్రారంభమయి ఆదివారం ఉదయం 3.46 గంటల వరకు ఉంటుంది. వసంత పంచమి శుభ ముహూర్తం శనివారం ఉదయం 7.19 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 వరకు ఉంది. రోజున తప్పని సరిగా హరి పూజలను నిర్వహిస్తారు. రైతన్నలకు కొత్త ధాన్యం వచ్చే రోజులు ఇవే. అందుకే కొత్త బియ్యంతో పాయడం చేసి దేవుళ్లకు నైవేధ్యంగా పెడతారు. 

ఈ వసంత పంచమినాడే చదువుల తల్లి సరస్వతి జయంతి అవడంతో ఈ పండుగ మరింత విశిష్టతను సంతరించుకుంది. అందుకే ఆ రోజున చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా పుస్తకాలను, కలాలను సరస్వతి దేవి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజున తమ పిల్లలకు సరస్వతీ మాతా దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఎందుకంటే.. అమ్మవారి దగ్గర అక్షరాభ్యసం చేయించడం వల్ల పిల్లలు జ్ఞానరాశులు అవుతారని వారి నమ్మకం. 

నేడు వసంత పంచమిని పురస్కరించుకుని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ దేవి ఆలయంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నిన్నటి నుంచే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. దాంతో ఆలయం మొత్తంలో సందడి వావతావరణం నెలకొంది. 

Also Read: Horoscope Today January 27 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పూర్తి మిశ్రమకాలం!!

Also Raed: IPL 2022 Auction: బెంగళూరు కెప్టెన్‌ రేసులో ఆరుగురు.. అవకాశం ఎవరికి దక్కనుందో మరి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News