TTD White Paper: ఆస్థులు, బంగారం నిల్వలపై టీటీడీ శ్వేతపత్రం, ఎంత ఉందంటే
TTD White Paper: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ పథకాల్లో పెట్టుబడులపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇచ్చింది. మరోవైపు సంస్థ ఆస్థుల్ని వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం..
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల దేవస్థానం ట్రస్ట్ టిటీడీ కీలక ప్రకటన చేసింది. సంస్థ పెట్టుబడులపై వస్తున్న ఆరోపణలకు స్పందించింది. మరోవైపు టీటీడీకు చెందిన బంగారం డిపాజిట్లు, వివిధ బ్యాంకుల్లో ఉన్న పెట్టుబడులపై శ్వేతపత్రం జారీ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ బ్యాంకులు, సంస్థల నుంచి క్వొటేషన్లు ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రైవేటు బ్యాంకుల్నించి కూడా క్వొటేషన్లు స్వీకరిస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టకూడదని టీటీడీ ప్రతిపాదించింది. శ్రీవారి హుండీలో వేసిన బంగారాన్ని కరిగించి, రిఫైన్ చేసి ఇన్వెస్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది టీటీడీ.
టీటీడీ సంస్థకు వివిధ బ్యాంకుల్లో ఉన్న పెట్టుబడుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో డబ్బుల రూపంలో పెట్టుబడులున్నవి 24 బ్యాంకులు. బంగారం డిపాజిట్లు 2 బ్యాంకుల్లో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెప్టెంబర్ 30 నాటికి 9819.38 కిలోల బంగారం నిల్వలున్నాయి. అటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సెప్టెంబర్ 2022 నాటికి 438.99 కిలోల బంగారం ఉంది.
బ్యాంకుల్లో ఉన్న టీటీడీ ఆస్థుల విలువ
పెట్టుబడుల విషయంలో అత్యధికంగా ఎస్బీఐలో 5358.11 కోట్లు ఉంటే..యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇంియాలో 1694.25 కోట్ల పెట్టుబడులున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1839.36 కోట్లు, కెనరా బ్యాంకులో 1351 కోట్లున్నాయి. యాక్సిస్ బ్యాంకులో 1006.20 కోట్లుంటే..హెచ్ డీఎఫ్ సి బ్యాంకులో2122.85 కోట్లున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 660.43 కోట్లుంటే..పంజాబ్ సింధ్ బ్యాంకులో 306.31 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇండియన్ బ్యాంకులో 25.30 కోట్లుంటే..సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 99 కోట్లు, యునైటెడ్ కమర్షియల్ బ్యాంకులో 18 కోట్ల పెట్టబడులున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 101 కోట్ల పెట్టుబడులున్నాయి. మొత్తం అన్ని బ్యాంకుల్లో కలిపి 15,938 కోట్లున్నాయి.
అంతా అవాస్తవమే
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యురిటీల్లో పెట్టుబడి పెడుతుందనే పుకార్లను టీటీడీ పూర్తిగా తప్పుబట్టింది. ఇందులో వాస్తవం లేదని తెలిపింది. షెడ్యూల్ బ్యాంకులు తప్ప మరెందులోనూ పెట్టుబడులు పెట్టడం లేదని తేల్చి చెప్పింది.
Also read: Astro Beliefs: బంగారం, వెండి వస్తువులు పోగొట్టుకున్నారా..అయితే ఏం జరుగుతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook