Astro Beliefs: బంగారం, వెండి వస్తువులు పోగొట్టుకున్నారా..అయితే ఏం జరుగుతుందో తెలుసా

Astro Beliefs: హిందూమతం ప్రకారం కొన్ని లోహాల విషయంలో నమ్మకాలు బలంగా ఉంటాయి. బంగారం లేదా వెండి విషయంలో ఇంకా అధికం. ఆ నమ్మకాలేంటి, ఏం జరుగుతుంది అనేది పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2022, 12:24 AM IST
Astro Beliefs: బంగారం, వెండి వస్తువులు పోగొట్టుకున్నారా..అయితే ఏం జరుగుతుందో తెలుసా

హిందూమతంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జ్యోతిష్యం ప్రకారం చాలా నమ్మకాలు, సెంటిమెంట్లు ఉంటాయి. బంగారం, వెండి వంటి లోహాల్ని పోగొట్టుకుంటే ఏం జరుగుతుందనేది విపులంగా వివరించి ఉంది. ఆ వివరాలు మీ కోసం..

శాస్త్రాల ప్రకారం..కొన్ని రకాల లోహాలతో శుభ, అశుభ సూచకాలు ముడిపడి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా బంగారం, వెండి వస్తువులు. వీటి ప్రభావం చాలా ఎక్కువని నమ్ముతారు. దైనందిక జీవితంలో కూడా బంగారం, వెండికి చాలా ప్రాముఖ్యత ఉంది. బంగారం, వెండి వస్తువులు పోగొట్టుకుంటే ఎలాంటి అశుభ సూచకాలున్నాయో పరిశీలిద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారు ఆభరణం దొరకడం లేదా కోల్పోవడం రెండూ అశుభమేనట. అందుకే బంగారం లేదా వెండి ఎక్కడైనా దొరికితే..తీసుకురాకూడదని పెద్దలు అంటుంటారు. వాస్తవానికి ఇదంతా గురుడితో సంబంధంతో ఉంటుందట. బంగారం పోగొట్టుకుంటే..నిజ జీవితంలో గురుడి అశుభ ప్రభావం ఉంటుందని జ్యోతిష్యలు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం బంగారం లేదా వెండి ఉంగరం పోతే..ఓ విధమైన అశుభమే. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది.

జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం చెవి ఉంగరాలు లేదా వస్తువులు పోగొట్టుకుంటే..అశుభమే. దీనివల్ల భవిష్యత్తులో చెడు జరుగుతుందని చెబుతారు. అదే సమయంలో ముక్కు పుడకలు వంటివి పోవడం కూడా అశుభమే. ఇలా జరిగితే తీవ్ర అవమానాలు ఎదురౌతాయి. జ్యోతిష్యం ప్రకారం కుడి కాలు పట్టీ పోతే సామాజిక ప్రతిష్ఠ తగ్గిపోతుందట. అదే ఎడమకాలి పట్టీ పోతే..ఏదో తెలియని దుర్ఘటన జరగవచ్చట. ఇక శాస్త్రాల ప్రకారం గాజులు లేదా బ్రేస్‌లెట్ పోగొట్టుకోవడం అశుభమే..దీనివల్ల పరువు గౌరవ మర్యాదలు తగ్గుతాయి. అందుకే బంగారం, వెండి వంటి వస్తువుల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాటిపట్ల అప్రమత్తత అవసరం.

Also read: Budh Gochar 2022: వృశ్చికరాశిలోకి ఎంటర్ అవ్వనున్న బుధుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News