TTD Updates: సంక్రాంతి పండుగ వేళ తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ టోకెన్ల జారీ పూర్తి కావడంతో దర్శనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు జనవరి 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. భక్తుల సౌకర్యార్ధం ఇవాళ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు జరగనున్న నేపధ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. రేపట్నించి జరిగే కార్యక్రమాలను టీటీడీ ప్రకటించింది. రేపు జనవరి 7వ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆనవాయితీ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు పురస్కరించుకుని ఆలయ శుద్ధి జరగనుంది. పదిరోజులు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారమే భక్తుల్ని అనుమతించనున్నారు. మరీ ముఖ్యంగా ఇవాళ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. 


ఆలయ శుద్ధి కారణంగా ఇవాళ, రేపు బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. తిరుమలలో ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపలి ఉప దేవాలయాలు, ఆలయం ప్రాంగణం, పోటు గోడలు, పైకప్పు, పూజాసామగ్రి అంతా శుభ్రం చేస్తారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో కప్పుతారు. శుద్ధి అనంతరం పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతా సంప్రోక్షణ చేస్తారు. ఆ తరువాత మూల విరాట్టుకు తొడిగించిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. 


Also read: Makar Sankranti 2025: మకర సంక్రాంతి నుంచి ఈ 5 రాశులకు మహర్దశే, ఊహించని డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.