Makar Sankranti 2025: మకర సంక్రాంతి నుంచి ఈ 5 రాశులకు మహర్దశే, ఊహించని డబ్బు

Makar Sankranti 2025: హిందూమతం ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి అంటే సూర్యుడు కుంభ రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయం. అంటే మకర సంక్రాంతి నుంచి శుభకార్యాలకు అత్యంత అనుకూలమని అర్ధం. 

Makar Sankranti 2025: జ్యోతిష్యం ప్రకారం మకర సంక్రాంతి నుంచి 5 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడమే కాకుండా పుష్య నక్షత్రం కూడా ప్రత్యేక సంయోగం ఏర్పర్చనుంది. దాంతో 5 రాశులకు దశ మారనుంది. పట్టిందల్లా బంగారం కానుంది.
 

1 /5

కుంభ రాశి మకర రాశిలో సూర్యుడి ప్రవేశం కారణంగా కుభం రాశి జాతకులకు చాలా ప్రయోజనం కలగనుంది. ఆర్ధికంగా లాభపడతారు. ఊహించని సంపద వచ్చిపడుతుంది. వ్యాపారులకు అనువైన సమయంగా భావించాలి. ఉద్యోగులకు కోరుకున్న స్థానం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి

2 /5

మకర రాశి మకర రాశి జాతకులకు అత్యంత అనుకూలమైంది. సూర్యుడు ఈ రాశిలోనే ప్రవేశించనున్నాడు. గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయి. పట్టిందల్లా బంగారం కావచ్చు. ఏ రంగంలో ఉన్నా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తే ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. 

3 /5

తుల రాశి తుల రాశి జాతకులకు అత్యంత అనుకూలమైన సమయం. ఆస్థికి సంబంధించిన వ్యవహారాల్లో లాభం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశముంది. 

4 /5

సింహ రాశి మకర సంక్రాంతి సందర్భంగా సింహ రాశి జాతకం మారిపోనుంది. సూర్యుడి కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా సాగుతోంది. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఊహించని సంపద లభిస్తుంది.

5 /5

మేష రాశి మకర సంక్రాంతి రోజు నుంచి మేష రాశి జాతకులకు కెరీర్ మారిపోనుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా లాభపడతారు. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. పెండింగులో పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబసభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది