Todays Horoscope: ఇవాళ అంటే ఆగస్టు 24వ తేదీ బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయా చూద్దాం. మీ రాశిని బట్టి ఇవాళ మీకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రభావం పడనుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహం, రాశిని బట్టి ప్రతిరోజూ ఫలితం మారుతుంటుంది. ఒకరోజు అనుకూలంగా ఉండవచ్చు..మరోరోజు ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి. ఇవాళ ఆగస్టు 24వ తేదీ బుధవారం. ఇవాళ మీ రాశిలో ఎలా ఉంటుంది, అనుకూల, ప్రతికూల ప్రభావాలు స్థూలంగా చెప్పాలంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయో చూద్దాం.


మేషరాశి వారికి ( Aries) ఇవాళ కుటుంబంలో అంతా కలిసొస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్ధులైతే చదువుపై పూర్తిగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.  మెరూన్ కలర్ ఈ రాశివారికి మంచి రంగు.


వృషభరాశివారు (Taurus) తాము తీసుకునే నిర్ణయాల్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి. ఉన్నతాధితకారుల తోడ్పాటు లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఈ రాశివారికి పింక్ కలర్ అనుకూలమైన రంగు.


మిధున రాశివారికి (Gemini) ఇవాళఁతా ఉరుకులు పరుగులే ఉంటాయి. బిజీగా ఉంటారు. వ్యాపారంలో మార్పులు చేయవద్దని సూచిస్తున్నారు. కాళ్ల నొప్పి సమస్య బాధిస్తుంది. తెలుపు రంగు అనుకూలమైంది.


కర్కాటక రాశివారికి (Cancer) ఇవాళ మానసిక ప్రశాంతత, ఆనందం ఉంటాయి. కొత్త పథకాలు లాభాల్ని తెచ్చిపెడతాయి. ఆఫీసులో కొత్త బాధ్యతలు లభిస్తాయి. 


ఇక సింహరాశివారికి (Leo) ఇవాళ మంచిరోజు. ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచి ఫలితాలు ఉండవచ్చు. వ్యాపారంలో వృద్ధి లభిస్తుంది. గుండె సంబంధిత సమస్యల్నించి ఉపశమనం కలుగుతుంది. ఎరుపు రంగు అనుకూలమైంది. 


కన్యారాశి వారికి (Virgo) పెళ్ళి విషయాలు పరిష్కారమౌతాయి. మిత్రుల సలహా తీసుకోవాలి. ఎవరైనా అమ్మాయిల పెళ్లికి సహాయం చేస్తే అంతా బాగుంటుంది. ఆకుపచ్చ రంగు అనుకూలమైంది.


తుల రాశివారికి (Libra) ఇవాళ బాగుంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి మునపటి కంటే మెరుగౌతుంది. ఇంటి సమస్యలు తొలగిపోతాయి. తెలుపు అనుకూలమైన రంగు.


వృశ్చిక రాశివారికి (Scorpio) కాస్త ప్రతికూలమే. దాంపత్య జీవితంలో ఇబ్బందులుంటాయి. మద్యాహ్నం తరువాత ఏ విధమైన శుభకార్యాలు చేయవద్దు. సంతాన కోర్కెలు పూర్తవుతాయి. 


ధనస్సు రాశివారు (Sagittarius) చదువులో ధ్యాస పెట్టాలి. కుటుంబంతో కలిసి బయటకు వెళతారు. మొత్తం రోజంతా ఆహ్లాదంగా ఉంటుంది. పసుపు అనుకూలమైన రంగు.


మకరరాశివారు (Capricorn) కాస్త అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన దూరమౌతుంది. నలుపు రంగు అనుకూలమైంది.


కుంభరాశివారికి (Aquarius) ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. తండ్రి సలహా మంచి ఫలితాలనిస్తుంది. నీలం రంగు అనుకూలమైంది.


మీనరాశి వారు (Pisces) ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మాట్లాడే విషయంలో సంయమనం అవసరం. లేకపోతే ఇబ్బందులు రావచ్చు. కెరీర్ లో చాలా మార్పు వస్తుంది. 


Also read: Dussehra 2022: దసరా పండుగ ఎప్పుడు, విజయ దశమి మహత్యం, శుభ ముహూర్తం, తిధి వేళలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook